నీ చురచురచుర చూపులే పంజా
సలసలసల ఊపిరే పంజా
నరనరమున నెత్తురే పంజా
అణువణువున సత్తువే పంజా
అదుపెరగని వేగమే పంజా
అదరని పెను ధైర్యమే పంజా
పెదవంచున మౌనమే పంజా
పదునగు ఆలోచనే పంజా
చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి
తప్పదనే యుద్ధముగా వేకువ చూడద రేపటి కాంతి
ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా
ఆటుపోటు లేనేలేని సాగరమే ఉంటుందా
ఎత్తు పల్లం లేనేలేని రహదారంటూ ఉందా
ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా
ఏదేమైన తుదివరకు ఎదురీత సాగాలిగా
అడుగడుగూ అలజడిగా
నీ జీవితమే నీ శత్రువు కాగా
బెదిరించే ఆపదనే ఎదిరించే గుణమేగా పంజా
ఆకాశం నీ పంజా
అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri