Kishore Kumar Hits

Pawan Kalyan - Kanti Papa şarkı sözleri

Sanatçı: Pawan Kalyan

albüm: Vakeel Saab


కంటిపాపా కంటిపాపా చెప్పనైన లేదే
నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా
కాలి మువ్వా కాలి మువ్వా
సవ్వడైనా లేదే
నువ్విన్నినాళ్ళుగా వెంట తిరుగుతున్నా
నీరాక ఏరువాక నీ చూపే ప్రేమలేఖ
నీలో నువ్వాగిపోక కలిసావే కాంతి రేఖ
అంతులేని ప్రేమ నువ్వై
ఇంత దూరం వచ్చినాక
అందమైనా భారమంతా నాకు పంచినాకా
మొదలేగా కొత్తకొత్త కథలు
మొదలేగా కొత్తకొత్త కలలు
ఇకపైనా నువ్వు నేను బదులు
మనమన్నా కొత్తమాట మొదలు

కంటిపాపా కంటిపాపా చెప్పనైన లేదే
నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా

సాపమాప మాప మాగసామగరిసా
సాపమాప మాప మాగసామగరిసా
సుదతీ సుమలోచినీ సుమనోహర హాసిని
రమణీ ప్రియ భాషిణీ కరుణాగున భాసిని
మనసైన వాడిని మనువాడిన ఆమని
బదులీయవే చెలీ నువు పొందిన ప్రేమనీ
పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా
సాపమాప మాప మాగసామగరిసా
సాపమాప మాప మాగసామగరిసా

ఎదలో ఏకాంతము ఏమయ్యిందో ఏమిటో
ఇదిగో నీ రాకతో వెళిపోయింది ఎటో
నాలో మరో నన్ను చూశా
నీకో స్నేహితుణ్ని చేశా
కాలం కాగితాలపై జంట పేర్లుగా
నిన్ను నన్ను రాసా
ఆకాశం గొడుగు నీడ
పుడమేగా పూల మేడ
ఏ చూపులు వాలకుండా
ప్రేమే మన కోటగోడ
నాకు నువ్వై నీకు నేనై
ఏ క్షణాన్ని వదలకుండా
గురుతులెన్నో పెంచుకుందాం గుండె చోటు నిండా
మొదలేగా కొత్తకొత్త కథలు
మొదలేగా కొత్తకొత్త కలలు
ఇకపైనా నువ్వు నేను బదులు
మనమన్నా కొత్తమాట మొదలు
మొదలేగా కొత్తకొత్త కథలు
మొదలేగా కొత్తకొత్త కలలు
ఇకపైనా నువ్వు నేను బదులు
మనమన్నా కొత్తమాట మొదలు

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar