నువ్వు జల్లే వెన్నెలంతా సల్లగుందని మిడిసిపోకే ఓ సందమామ తన ఒళ్ళు కాల్చి ఎండ నీకు ఎలిగిపోయే గుణమిచ్చిందే నా సందమామ ♪ సందెఏళ కుంగుతుంటే గెలిసినావని సంబరబడకే ఓ సందమామ కణకణ నిప్పుల కణిక ఓలే పొద్దుపొడిసే తెల్లవారి నా సందమామ కీచురాళ్ళ చప్పుడు జేసి గోసపెట్టినానుకోకే ఓ సందమామ మబ్బు జేసే ఘర్జనలింటే దద్దరిల్లి బుగ్గలైతవ్ నా సందమామ ఆకుపచ్చని అమ్మతోటి ఆకతాయి ఆటలొద్దే ఓ సందమామ నిన్ను కూల్చగా జమ్మిచెట్టున ఆయుధాలను దాచుకుందే నా సందమామ సుట్టు సుక్కలు ఉన్నయంటూ సూసి నువ్వు మురిసిపోకే ఓ సందమామ నీ సిట్టసివరి దారిలోన నీడ కూడా తోడు రాదే నా సందమామ సీకటంతా తాగి నువ్వు సిత్తరంగా సిందెయ్యకే ఓ సందమామ అమావాస్య ఘడియ నీకు ముందరుందని మర్సిపోకే నా సందమామ నేను నేననే పట్టుతోటి నీకు నువ్వే దూరంగాకే ఓ సందమామ నువ్వు పుట్టక ముందే పుట్టే నువ్వు బోయినా ఉంటదే లోకం నా సందమామ