సెభాష్
ఆడాగాదు ఈడాగాదు
అమీరోల్లో మేడాగాదు
గుర్రంనీల్లా గుట్టాకాడ
అలుగూ వాగు తాండాలోన
బెమ్మాజెముడు చెట్టున్నాది
బెమ్మజెముడూ చెట్టూకింద
అమ్మా నెప్పులు పడతన్నాది
ఎండాలేదు రేతిరిగాదు
ఏగూసుక్కా పొడవంగానే
పుట్టిండాడు పులి పిల్ల
పుట్టిండాడు పులిపిల్ల
నల్లామల తాలూకాల
అమ్మా పేరు మీరాబాయి
నాయన పేరు సొమ్లా గండు
నాయన పేరు సోమ్లా గండు
తాతా పేరు బహద్దూర్
ముత్తులతాత ఈర్యానాయక్
పెట్టిన పేరు భీమ్లానాయక్
సెభాష్
భీమ్లానాయకా
భీమ్లానాయక్
భీమ్లానాయక్
ఇరగదీసే ఈడి fire-u సల్లగుండ
ఖాకీ dress-u పక్కనెడితే వీడే పెద్దగూండా
నిమ్మళంగ కనబడే నిప్పుకొండ
ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా
ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క
చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా
విరుగును బొక్క
(భీం భీం భీం భీం భీమ్లానాయక్
బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
భీం భీం భీం భీం భీమ్లానాయక్
దంచి దడదడదడలాడించే duty సేవక్)
ఆ జుట్టునట్టా సవరించినాడో సింగాలు జూలు విదిలించినట్టే
ఆ shirt-uనట్టా మడతెట్టినాడో రంగాన పులులు గాండ్రించినట్టే
ఆ కాలి boot-u బిగ్గట్టినాడో తొడగొట్టి వేట మొదలెట్టినట్టే
భీమ్లానాయక్
భీమ్లానాయక్
ఎవ్వడైన ఈడి ముందు గడ్డిపోస
ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస
కుమ్మడంలో విడే ఒక brand-u తెల్సా
వీడి దెబ్బతిన్న ప్రతివోడు past tense-a
నడిచే రూటే
Straight-u
పలికే మాటే
Right-u
Temperament-ఏ
Hot-u
Powerకు ఎత్తిన
Gate-u
ఆ name-u plate-u
(భీం భీం భీం భీం భీమ్లానాయక్
బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
భీం భీం భీం భీం భీమ్లానాయక్
దంచి దడదడదడలాడించే duty సేవక్)
గుంటూరుకారం ఆ uniform
మంటెత్తిపోద్ది నకరాలు చేస్తే
లావాదుమారం లాఠీ విహారం
పేట్రేగిపోద్ది నేరాలు చూస్తే
సెలవంటూ అనడు శనాదివారం
All round clock-u పిస్తోలు దోస్తే
భీమ్లానాయక్
భీమ్లానాయక్
ఎల్లమ్మా
ఎల్లమ్మా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri