Kishore Kumar Hits

Haripriya - Kothaga Ledhenti (From "Ranga Ranga Vaibhavanga") şarkı sözleri

Sanatçı: Haripriya

albüm: Kothaga Ledhenti (From "Ranga Ranga Vaibhavanga")


కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి
ఇంత దగ్గరున్నా నువ్వు నేను కొత్తగా లేదేంటి
ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి
ఎంత దూరమైనా నువ్వు నేను ఒక్కటే కాబట్టి
మనిషినెక్కడో ఉన్నా మనసు నీ దగ్గరే
నిదురలో నేనున్నా కలలు నీ వద్దకే
ఒకరికొకరై కలిసిలేమా ఇద్దరం ఒకరై ఒకరై
కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి
ఇంత దగ్గరున్నా నువ్వు నేను కొత్తగా లేదేంటి
ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి
ఎంత దూరమైనా నువ్వు నేను ఒక్కటే కాబట్టి
గుండెసడి తోటి ముద్దుసడి పోటీ
హద్దు దాటిందే అయినా కొత్తగా లేదేంటి
సెకనుకో కోటి కలలు కనలేదేంటి
దానితో పోల్చి చూస్తే ఇందులో గొప్పేంటి
ఎంత ఏకాంతమో మన సొంతమే అయినా కొత్తగా లేదేంటి
ఎంతపెద్ద లోకమో మనమధ్యలో అయినా ఎప్పుడడ్డుగుందేంటి
కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి
ఇంత దగ్గరున్నా నువ్వు నేను కొత్తగా లేదేంటి
ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి
ఎంత దూరమైనా నువ్వు నేను ఒక్కటే కాబట్టి
కొత్తగుంటుంది ప్రేమ అంటారే
పక్కనుంది ప్రేమే అయినా కొత్తగా లేదేంటి
మొదటి అడుగేసే పాపవా నువ్వు
ఇంత నడిచాక నడకలో తడబాటుంటాదేంటి
ఎన్నినాళ్ళ వీక్షణం ఈ క్షణం అయినా కొత్తగా లేదేంటి
ఎందుకంటే ఏ క్షణం విడిపోం మనం అని నమ్మకం కాబట్టి
కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి
ఇంత దగ్గరున్నా నువ్వు నేను కొత్తగా లేదేంటి
ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి
ఎంత దూరమైనా నువ్వు నేను ఒక్కటే కాబట్టి

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar