రాధా రాధా మదిలోన మన్మధ గాధ రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ పడగెత్తిన పరువాలతో కవ్వించకే కాటేయవే ఓ ఓ ఓ ఓ ఓ ... రాజా రాజా మనసైన మన్మధ రాజా రాత్రి పగలు రగిలింది మల్లెల బాధ నువ్వూగితే కాలాగదు. నే నాడితే నువ్వాగవూ ఆ... ఆ... ఆ... ఆ. రాధా రాధా మదిలోన మన్మధ గాధ రాజా రాజా మనసైన మన్మధ రాజా స్వరాలు జివ్వుమంటే... నరాలు కెవ్వుమంటే సంపంగి సన్నాయి వాయించనా పెదాలే అంటుకొంటే... పొదల్లో అల్లుకుంటే నా లవ్వు లల్లాయి పండించనా బుసకొట్టే పిలుపుల్లో... కసిపుట్టే వలపుల్లో కైపెక్కి ఊగాలిలే ఓ ఓ ఓ ఓ... రాజా రాజా మనసైన మన్మధ రాజా రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ పూబంతి కూతకొచ్చి... చేబంతి చేతికిచ్చి పులకింత గంధాలు చిందించనా కవ్వింత చీర కట్టి... కసిమల్లె పూలు పెట్టి జడ నాగు మెడకేసి బంధించనా నడిరేయి నాట్యంలో... తొడగొట్టే లాస్యంలో చెలరేగిపోవాలిలే రాధా రాధా మదిలోన మన్మధ గాధ రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ పడగెత్తిన పరువాలతో కవ్వించకే కాటేయవే హోయ్ హోయ్ హోయ్. రాజా రాజా మనసైన మన్మధ రాజా రాత్రి పగలు రగిలింది మల్లెల బాధ నువ్వూగితే కాలాగదు. నే నాడితే నువ్వాగవూ ఓ.ఓ.ఓ.ఓ... రాధా రాధా మదిలోన మన్మధ గాధ రాజా రాజా మనసైన మన్మధ రాజా