రాబందుల రాజ్యంలో కామందుల దాస్యంలో
చెరసాలకు ఉరి కొయ్యకు
తలవంచిన తమ్ముడా
రావణులు కీచకులు సైంధవులే పాలకులై
చెలరేగెను విలయంలో విలవించే చెల్లెలా
భయపడితే ప్రతిక్షణం చావేలే బతుకు
చచ్చినా బతకలేని బతుకెందుకు మనకు
భయపడితే ప్రతిక్షణం చావేలే బతుకు
చచ్చినా బతకలేని బతుకెందుకు మనకు
నువ్వు నేను మనమైతే
మనం మనం తిరగబడితే
భయపెట్టిన దొర తనమే
బతకలేక చావాలి
మన చావుతోనైనా
ముందు తరం బతకాలి
వందే మాతరం మనదే భారతం
బతిగిద్దాం భావితరం
భావితరం భావితరం
♪
అక్రమాన్ని ఎదిరించే నోరులేని ఊరెందుకు
అక్షరాన్ని వెలిగించే బడేలేని వీదెందుకు
ధగాకోరు దోపిడిపై దండెత్తని మనిషెందుకు
రక్తాలు రగిలించి రాజ్యాలు కదిలించి
ప్రాకారములు దాటి ఆకాశములు తాకి
ఆవేశముగ కదలిరా
♪
స్వాతంత్ర శత్రువుల గుండెలో భల్లెమై
పర పీడనా పరుల
తరిమికొట్టిన బాపు ఎక్కడున్నాడు
పాప పంఖమునుండి పద్మాలు పుట్టించి
కలకాల స్వర్గాన్ని కలగన్న ఇందిరా
కనిపించదేమి
సామ్యవాద పదాన సామరస్య విధాన
ప్రగతి కోరిన నేత రాజీవుడు కానరాడేమి
మహాత్ములను మహాత్మలను మానవతను హతమార్చి
కుతంతాలు ఈ దురంతాలు
ఎన్నాళ్లు ఇంకెన్నేళ్లు
వందే మాతరం
మనదే భారతం
(బతిగిద్దాం భావితరం భావితరం)
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri