Balakrishna - Kallo Kalyana Maala şarkı sözleri
Sanatçı:
Balakrishna
albüm: Pedda Annayya
కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
కలలే నిజమైన వేళా మనువొక రసలీలా
పరిచయమైనవి పరువాలు
పరవశమైనవి హృదయాలు
కంటికే దీపమై గగనము విడిచెను తారకా
కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
♪
సిరికోయిల చిలిపి వలపై పాడేనమ్మా
యదలోయలా కనులే కలలై పండెనమ్మా
నిను చేరితే మనసే వయసై పిలిచేనమ్మా
నిదరోయినా సొగసే ఎదురై వలచేనమ్మా
మనసే మనువాడగా జతగా పెనవేయగా
ఊర్వసే ప్రేయసై వధువుగ వెలసెను కౌగిట
కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
♪
సిరిమల్లికా సిగలో వగలే చిలికేనమ్మ
వరమాలిక వలపై వగలే విసిరేనమ్మా
మధుమాసమే మనదై మధువే కురిసేనమ్మ
సుముహూర్తమే శుభమై సుఖమై కుదిరేనమ్మా
జరిగే మన పెళ్ళికి జగమే విరి పల్లకి
ఏకమై పోయిన మమతలు వెన్నెల కాయగా
కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
కలలే నిజమైన వేళా మనువొక రసలీలా
పరిచయమైనవి పరువాలు
పరవశమైనవి హృదయాలు
కంటికే దీపమై గగనము విడిచెను తారకా
కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
కలలే నిజమైన వేళా మనువొక రసలీలా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri