Kishore Kumar Hits

Ramesh Naidu - Kobbari Neella şarkı sözleri

Sanatçı: Ramesh Naidu

albüm: Rendu Jella Sita


కొబ్బరి నీళ్ళ జలకాలాడి
ఊహూ ఊహూ ఊహూ
కోనసీమ కోకగట్టి ఆహా ఆహా ఆహా
పొద్దుటెంట తిలకాలెట్టి
ముద్దపసుపు సందేలకొస్తావా
ముద్దు తీర్చే సందిటికొస్తావా
ముద్దు తీర్చే సందిటికొస్తావా
కొబ్బరి నీళ్ళ జలకాలాడి
ఊహూ ఊహూ ఊహూ
కోనసీమ కోకగట్టి ఊహూ ఊహూ ఊహూ
పొద్దుటెంట తిలకాలెట్టి
ముద్దపసుపు సందేలకొస్తాలే
ముద్దుతీర్చే సందిలి ఇస్తాలే
ముద్దు తీర్చే సందిలి ఇస్తాలే

ఆకాశ వీణల్లో నేను
అనురాగమే పాడుకుంటా
గోంగూర పచ్చట్లో నేను
ఉల్లిపాయే నంజుకుంటా
స్స్ నీరుల్లిపాయే నంజుకుంటా
ఆకాశ వీణల్లో నేను
అనురాగమే పాడుకుంటా
శృంగార వీధుల్లో నేను
రస నాట్యమే ఆడుకుంటా
ప్రేమ రస నాట్యమే ఆడుకుంటా
మాటివ్వు నాకు మనసిచ్చుకుంటా
వదిలేస్తే వంకాయ వండించుకుంటా
ఆ Iam sorry
వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీతవంటి భార్యామణి
అన్నారు కదండి
అందుకే అలా పాడానన్నమాట
ఓహో
కొబ్బరి నీళ్ళ జలకాలాడి
ఊహూ ఊహూ ఊహూ
కోనసీమ కోకగట్టి ఊహూ ఊహూ ఊహూ
పొద్దుటెంట తిలకాలెట్టి
ముద్దపసుపు సందేలకొస్తావా
ముద్దు తీర్చే సందిటికొస్తావా
ముద్దు తీర్చే సందిలి ఇస్తాలే

అమ్మవారి ఎదుట నేనూ
నీ కుంకుమే దిద్దుకుంటా
నీకోసమే కాచుకుంటా
అమ్మతో చెప్పి నేనూ
అప్పచ్చులే తెచ్చుకుంటా
అమ్మవారి ఎదుట నేనూ
నీ కుంకుమే దిద్దుకుంటా
నీకోసమే కాచుకుంటా
అసుర సంధ్య వేళ నేనూ
ఆలయంలో వేచివుంటా
నీ హారతే అందుకుంటా
మాగాయలోన పెరుగేసుకుంటా
వదిలేస్తే నా దారి
నే చూసుకుంటా చూడండి
మాగాయ మహా పచ్చడి
పెరుగేస్తే మహత్తరి అదివేస్తే అడ్డవిస్తరి
మానిన్యా మహాసుందరి అన్నారు కదండి
అందుకే అలా పాడానన్నమాట
హ హ హ

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar