Ghantadi Krishna - Vey Vela Jey şarkı sözleri
Sanatçı:
Ghantadi Krishna
albüm: Devathalu
వేవేల జేజేలివే
జగమేలే జగదీశ్వరీ
మీకేలే మా పూజలే
భువిలోని భువనేశ్వరీ
పజ్జెనిమిది శక్తిపీఠాలలో
ముజ్జగములే ఏలు పెద్దమ్మలు
వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు
వేవేల జేజేలివే
జగమేలే జగదీశ్వరీ
వేవేల జేజేలివే
♪
(హొయ్యరే హొయ్యారె హొయ్యా)
(హొయ్యరే హొయ్యారె హొయ్యా)
(హొయ్యరే హొయ్యారె హొయ్యా)
(హొయ్యరే హొయ్ హొయ్ హొయ్యా)
(హొయ్యరే హొయ్యారె హొయ్యా)
(హొయ్యరే హొయ్యారె హొయ్యా)
(హొయ్యరే హొయ్యారె హొయ్యా)
(హొయ్యరే హొయ్ హొయ్ హొయ్యా)
♪
మా గుండెలే నీ గుడిగంటలై
మారుమ్రోగేనే కోనంతా
మా ఊరంతా
నాలుగు వైపుల పచ్చన
నువ్వు ఊరికి ఇచ్చిన దీవెన
ఇల్లిల్లు చేసేను చల్లన
నీ వెన్నెల చూపుల పాలన
సెలయెరులా అడవి పొలిమేరలా
ఉరికి ప్రవహించి ఓయమ్మా
నీ ప్రేమయై
వేవేల చేతులతో వెలసితివమ్మా
అమ్మా ముగ్గురమ్మలకే నువ్వు మూలపుటమ్మా
కొండల కోనల మధ్యలో
కోటి సూర్యులచంద్రుల వెలుగుతో
అండదండలియ్యనుంటివే
మా అక్కమ్మ చెల్లెమ్మ బంగరు తల్లి
వేవేల జేజేలివే
జగమేలే జగదీశ్వరీ
వేవేల జేజేలివే
♪
(బంతమ్మ బంతి బంతికియాలో)
(సిత్రాల తోటకాడ సిలకమ్మ సిందులోయ్)
(గజ్జె కట్టి కుచ్చులోన)
(పిచ్చుకమ్మ సవ్వడి)
(కోకిలమ్మ పాటకేమో గోరువంక సవ్వడి)
నీవే కదా శ్రీ భ్రమరాంబిక
ఆ కాశీపురి అన్నపూర్ణాంబిక
మాధవీ దేవివి నీవేగా
ఆ మాణిక్యాంబవి నీవేగా
జోగులాంబ దేవి నీవేగా
పురుహూతికా దేవి నీవేగా
శ్రీలంకలో ఉన్న శాంకరి నీవే
సిరుల కొల్హపురి మహాలక్ష్మివి నీవే
బెజవాడలో కనకదుర్గాంబవి
తల్లీ ఉజ్జయినిలో మహాకాళివి నీవే
ఎక్కడ ఎక్కడ ఎప్పుడు
నువ్వు ఎన్నెన్ని రూపాల ఉన్నను
అక్కమ్మ చెల్లెమ్మ రూపున
మా పక్కనే ఉందువే చక్కని తల్లి
వేవేల జేజేలివే
జగమేలే జగదీశ్వరీ
మీకేలే మా పూజలే
భువిలోని భువనేశ్వరీ
పజ్జెనిమిది శక్తిపీఠాలలో
ముజ్జగములే ఏలు పెద్దమ్మలు
వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు
వేవేల జేజేలివే
జగమేలే జగదీశ్వరీ
వేవేల జేజేలివే
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri