Kishore Kumar Hits

Kamalakar - Aakasa Ganga şarkı sözleri

Sanatçı: Kamalakar

albüm: Vaana


ఆకాశగంగా దూకావే పెంకితనంగా
ఆకాశగంగా
జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడివేస్తున్నా నిన్నాపగా
ఆకాశగంగా దూకావే పెంకితనంగా
ఆకాశగంగా

కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే
కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే
చిటపటలాడి వెలసిన వాన
మెరుపుల దాడి కనుమరుగైనా
నా గుండె లయలో విన్నా నీ అలికిడి
ఆకాశగంగా దూకావే పెంకితనంగా
ఆకాశగంగా

ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
మనసుని నీతో పంపిస్తున్నా
నీ ప్రతి మలుపు తెలుపవే అన్నా
ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా
ఆకాశగంగా దూకావే పెంకితనంగా
ఆకాశగంగా
జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడివేస్తున్నా నిన్నాపగా
ఆకాశగంగా దూకావే పెంకితనంగా
ఆకాశగంగా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar