Aditi Bhavaraju - Enno Ennenno şarkı sözleri
Sanatçı:
Aditi Bhavaraju
albüm: Enno Ennenno
ఎన్నో ఎన్నెన్నో కొత్త అందాలే ఈ వేళ
గంధాల గాలుల చలివేళా
అవనంతా ఆమని అల్లిన హరివిల్లా ఇలా
మనసంతా తొలకరి పొదరిల్లా
తెమ్మరలే జుమ్మంటుంటే ముంగురులే రేగేస్తుంటే
చిరునవ్వే చిందేసిందే రమ్మని పిలిచిందే
♪
ఓ కొత్త చివురులా వసంతమా
కోయిలమ్మకే సొంతమా
కన్నె ఈడుకే సావాసమా
చెలి తోడు కోసమా
విరిసిన మరుమల్లి కోసం
విరి తేనెల పూల కోసం
కరిమబ్బుల నీడ కోసం
నను తాకే నీ చూపు కోసం
జగమే ఊగినది ఒకటై కలిపినది
నీతో నన్నిలా
యుగమే మారినది క్షణమై కరిగినది
నీతో ఈవేళా
♪
మునుపెన్నడు చూడలేదే మురిపించే చిత్రాలే
తోరణాల మాలలుగా రంగు పూల జాతరగా
సడి చేసే కుసుమాలే
తడి తపనలు రేపాయే
అలరించే అందాలే నను స్వాగతించాయే
గుబులే రేపకే ఎదలో
మనసుపడి చేరే నీ కౌగిటా
ఎదురే చూడనీ కనులే
ఆశపడి కోరే ఓ ముద్దటా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri