గాంధారి ఖిల్లా కత్తవా గంగమ్మ
ఘడియకొక్క నల్లపూస కొనిత్తనే గౌరమ్మ
కొమురం భీం కొండ కత్తవా కనకమ్మ
కొమురం భీం కొండ కత్తవా కనకమ్మ
కొండగోగు పూలు ఇత్తనే కట్టమ్మ
కోతెడ్ల కచ్చురమెక్కి పోదాం కమలమ్మ
కాలేరు కలియ తిరుగుదామే కంకాలమ్మ
గాంధారి ఖిల్లా కత్తవా గంగమ్మ
ఘడియకొక్క నల్లపూస కొనిత్తనే గౌరమ్మ
తందానే తందనే తందానా తానే తందాన
తందరేరే తంద రందానా తానే తందానా
తందరన తంద నందనా తందా అంధ అందరే
రన్ననార తాంద నందానా ఏ
కవ్వాల అడవి పోదామా కట్టమ్మా
ఇప్ప పువ్వు తీపి లడ్డు తినిపిత్తనే ఈరమ్మ
మన మందమర్రి మణులు సూత్తవా మల్లమ్మ
మన మందమర్రి మణులు సూత్తవా మల్లమ్మ
మేలైన కంటినగలు మెడలేత్తనే మంగమ్మ
గోదారి తెల్ల ఉశికే సూద్దమా గంగమ్మ
అద్దాల బొట్టు రైకకు వన్నెలైతాయే అజ్రమ్మ
అరపంపా రపంపా రపం పరిరిరి
తందరన తంద నందనా తందా అంధ అందరే
రన్ననార తాంద నందానా ఏ
గుడిరేవు నెమలీకలు సూత్తవా రాజమ్మ
క్వారీలోయల్లో మోదుగుకోయన కొమురమ్మ
ప్రాణహిత గాలిలో ఒ
ప్రాణహిత గాలిలో పాడుదామ పోశమ్మ
పాలుగారే పైడికంటలిత్తనే లచ్చమ్మ
రంగుల హోలినాడు రంగుపూత్తనే రంగమ్మ
ఘనమైన పండుగనే కొలుద్ధమే గోపమ్మ
గాంధారి ఖిల్లా కత్తవా గంగమ్మ
ఘడియకొక్క నల్లపూస కొనిత్తనే గౌరమ్మ
కొమురం భీం కొండ కత్తవా కనకమ్మ
కొండగోగు పూలు ఇత్తనే కట్టమ్మ
కోతెడ్ల కచ్చురమెక్కి పోదాం కమలమ్మ
కాలేరు కలియ తిరుగుదామే కంకాలమ్మ
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri