ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా అందమైన ఊహేదో మదిలో వాలి అల్లరేదో చేసిందా మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా నే పలికే భాషే నువ్వయావే వెన్నెలా రెండు కన్నులెత్తి గుండెలపై నీ చూపే గీశావా ఆ గీతే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా ఆనందమానంద మదికే ఏమందమేమందమొలికే నీ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమానంద మదికే ఏమందమేమందమొలికే నీ పిలుపు నా అడుగు నదికే పొంగే వరదలా ♪ మిలమిల మెరిసే కనుచివరలే మినుకుల్లా విసరకు నువ్వే నీ చూపులే మెరుపుల్లా మెరిసెనా మెల్లగా దారిలోన మల్లెల వాన కురిసెనా ధారగా రంగు రంగు తారలతోనా వీణలై క్షణాలిలా స్వరాలూ పూసేనా ప్రేమలో ఓ నిమిషమే యుగాలు సాగేనా ఆనందమానంద మదికే ఏమందమేమందమొలికే నీ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమానంద మదికే ఏమందమేమందమొలికే నీ పిలుపు నా అడుగు నదికే పొంగే వరదలా