నీ ఊపిరినే పోసి నీలో రంగులు పూసి నీ కడుపున నువ్వు చేసే బొమ్మే నేనమ్మా ఏ రాతల్ని రాసాడో నా నూరేళ్ళు ఆ బ్రహ్మ నీ పొత్తిళ్ళు లేకుంటే జన్మే లేదమ్మా అమ్మా అని పిలిచే శబ్దం ఓంకారం అమ్మా అమ్మా అను రూపం కన్నా దైవం లేదమ్మా గాయం చేసి పుట్టానమ్మా నీ దేహానికే గుండెల్లోనే నన్ను దాచే గుణం నీదిలే గోరుముద్దలో ప్రేమ జోలపాటలో ప్రేమ దేవుడైన చూసేనా లేనే లేదమ్మా అమ్మా అని పిలిచే శబ్దం ఓంకారం అమ్మా అమ్మా అను రూపం కన్నా దైవం లేదమ్మా లోకం వెంట రానంటున్నా తోడుంటావులే నింగినైన తాకమనే ధైర్యం నీవులే చిన్నముద్దులో అయినా చెంపదెబ్బలో అయినా గొప్పవాడు కమ్మంటూ ఉంది దీవెన అమ్మా అని పిలిచే శబ్దం ఓంకారం అమ్మా అమ్మా అను రూపం కన్నా దైవం లేదమ్మా నీ ఊపిరినే పోసి నీలో రంగులు పూసి నీ కడుపున నువ్వు చేసే బొమ్మే నేనమ్మా ఏ రాతల్ని రాసాడో నా నూరేళ్ళు ఆ బ్రహ్మ నీ పొత్తిళ్ళు లేకుంటే జన్మే లేదమ్మా