Kishore Kumar Hits

S.V.Krishna Reddy - Sri Rasthu Subhamastu şarkı sözleri

Sanatçı: S.V.Krishna Reddy

albüm: Aahwanam


శ్రీరస్తు శుభమస్తు అభిజ్ఞమస్తు
స్వస్తి శ్రీ చాంద్రమానేన
శ్రీ దాతృ నామ సంవత్సరం
మార్గశిర శుద్ద శనివారం
అనగా తేదీ 14-12-96న
శ్రవణ నక్షత్ర యుక్త
ధనుర్ లగ్న మందు
ఉదయం 8-13 నిమిషములకు
వివాహమునకు సుముహూర్తముగా
నిర్ణయించడమైనది

హా సువ్వి ఆహా సువ్వి
హా సువ్వి ఆహా సువ్వి

ఆకాశం పందిరి వేసింది
ఈ నేలమ్మ పీటను వేసింది
జరిగే వైభోగం రమ్మంది
జనులారా కనులారా చూడండి
మంగళవాద్యాలు పిలుపులు అందించగ
ముంగిట మురిపాలు కళకళలాడగ
పచ్చగ పెళ్ళయ్యే ముహూర్తమే తథాస్తంది
ఆకాశం పందిరి వేసింది
ఈ నేలమ్మ పీటను వేసింది
హా సువ్వి ఆహా సువ్వి
హా సువ్వి ఆహా సువ్వి

నలుగురూ చేరి నలుగుపెట్టరే
చిన్నారిని జలకాలాడించరే
ముద్దుగా ముస్తాబును చెయ్యరే
బుగ్గమీద పెళ్ళిచుక్క దిద్దరే

వరుడితొ మగపెళ్ళివారు తయ్యారు
విడిదికి వియ్యాలవారు వచ్చారు
మనవిని మన్నించి మనువుకి రండయ్యా ఆ
పప్పన్నం పెడతాం దయచేయండయ్యా
అడిగినవన్నీ ఇచ్చి కన్యాదానం చేస్తామయ్యా
ఆకాశం పందిరి వేసింది
ఈ నేలమ్మ పీటను వేసింది
హా సువ్వి ఆహా సువ్వి
హా సువ్వి ఆహా సువ్వి

గౌరీపూజను చేసి చేసి
నీ కోసం నోములు నోచి నోచి
కులుకుల కాణాచి అదిగో వచ్చింది ఈ
తెరవెనుకన వేచి కలలే కంటోంది
పరిణయ ప్రమాణమే చేసి పొందమంటోంది
ఆకాశం పందిరి వేసింది
ఈ నేలమ్మ పీటను వేసింది

ధర్మే త్వయా యేశ నాతిచరితవ్యా
(ధర్మే త్వయా యేశ నాతిచరితవ్యా)
అయ్య నాతిచరామి అనండి నాతిచరామి
అర్థేత్వయా యేశ నాతిచరితవ్యా)
(అర్థేత్వయా యేశ నాతిచరితవ్యా) నాతిచరామి
కామేత్వయా యేశ నాతిచరితవ్యా
(కామేత్వయా యేశ నాతిచరితవ్యా) నాతిచరామి
అయ్యా ఈ మంత్రాలు అంటున్నారు
అనమంటున్నారుగాని మరి వాటికి అర్థాలు
తెలియాలి కదండీ చెబుతారా అలాగే
ధర్మార్థకామములలోన ఏనాడూ
ఈమె తోడును నీవు విడిచిపోరాదు
ఈ బాస చేసి ఇక నిండు నూరేళ్ళు
ఈ సతికి నీడవై నిలిచి కాపాడు
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా
కంఠే భద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం

నా జీవితానికే అధారము
అయి నిన్నుఅల్లింది ఈ దారము
నీ మెడను వాలు ఈ మాంగల్యము
నా శాంతి సౌఖ్యముల సంకేతము
ఈ సూత్రముతో నీవు చిరకాలము
వర్ధిల్లితే నాకు అది క్షేమము
ఓం ధృవంతే రాజా వరుణో
ధృవం దేవో బృహస్పతిః
ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం
ధారయతాం ధృవం
ఈ జన్మలో ఇంక విడని ముడివేసి
కలిపారు దేవతలు దివినుంచి చూసి
ఈ బ్రహ్మముడి ఇద్దరిని ఒకటి చేసి
దాంపత్య రాజ్యాన్ని ఏలమంటోంది

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar