పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం నువ్వు రామ్మా ఓ వేదమా విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేరుచేయుమా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మ పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం ప్రతి మనువూ స్వర్గంలో మునుముందే ముడిబడుతుందా ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్య నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్య నువ్వు రామ్మా ఓ అరుంధతి ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మ నిజంగా పెళ్ళికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మ పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది పతి విడిచిన సతి గమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు నువ్వు రామ్మా మాంగళ్యమా వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళ్ళకు విడాకుల వేడుకలో నేడు తెంపడం నేర్పడానికి పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం