గుండె గూటికి పండుగొచ్చింది పండు వెన్నెల పంచుతుంది మబ్బుల్లో జాబిల్లి ముంగిట్లో దిగుతుంది నా ఇంట్లో దీపం పెడుతుంది గుండె గూటికి పండుగొచ్చింది పండు వెన్నెల పంచుతుంది మబ్బుల్లో జాబిల్లి ముంగిట్లో దిగుతుంది నా ఇంట్లో దీపం పెడుతుంది నేలనొదిలిన గాలి పరుగున ఊరంతా చుట్టాలి వేళ తెలియక వేల పనులను వేగంగా చేయాలి నా ఇంటి గడపకి మింటి మెరుపుల తోరణమే కట్టాలి కొంటె కలలతో జంట చిలకకి స్వాగతమే చెప్పాలి ఎన్నెన్నో ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది ఏ పని తోచక తికమక పెడుతుంది గుండె గూటికి పండుగొచ్చింది పండు వెన్నెల పంచుతుంది మబ్బుల్లో జాబిల్లి ముంగిట్లో దిగుతుంది నా ఇంట్లో దీపం పెడుతుంది బావ మమతల భావకవితలే శుభలేఖలు కావాలి బ్రహ్మ కలిపిన జన్మముడులకు సుముహూర్తం రావాలి మా ఏడు అడుగుల జోడు నడకలు ఊరంతా చూడాలి వేలు విడువని తోడు ఇమ్మని అక్షింతలు వేయాలి ఇన్నాళ్ళూ ఇన్నాళ్ళూ ఎదురుచూసే నా ఆశలరాజ్యంలో రాణిని తీసుకువచ్చే కలకల కనపడగా గుండె గూటికి పండుగొచ్చింది పండు వెన్నెల పంచుతుంది మబ్బుల్లో జాబిల్లి ముంగిట్లో దిగుతుంది నా ఇంట్లో దీపం పెడుతుంది