Kishore Kumar Hits

S.V.Krishna Reddy - Yegire Paavuramaa şarkı sözleri

Sanatçı: S.V.Krishna Reddy

albüm: Yegire Paavuramaa


ఎగిరే పావురమా
ఎదిగే యవ్వనమా
కలతో కాపురమా
కలతే వరమా
సుడిగాలి దీపమా
సడిలేని రాగమా
సుడిగాలి దీపమా
సడిలేని రాగమా
మనసైతే నేరమా
మమకార మేఘమా
మనసైతే నేరమా
మమకార మేఘమా
కన్నీరుగ కరిగే హృదయమున
ఎగిరే పావురమా
ఎదిగే యవ్వనమా
కలతో కాపురమా
కలతే నీ వరమా
చిలకమ్మతో ముడి చిననాటనేపడి
గోరవంక ఒక్కటి జత కోరుకున్నది
మది పాడితే మధురస ప్రియతమ గీతిక
విధి ఆడెను తొలివలపుల విషనాటిక
మనసేమో భారమై, మనువేమో దూరమై
తొలివేణు గానమే మరనాడు మౌనమై
ఏ దిక్కని వెతికే గగనమిలా
ఎగిరే పావురమా
ఎదిగే యవ్వనమా
కలతో కాపురమా
కలతే నీ వరమా
ఒక కొమ్మ నీడలో పెరిగింది కోకిల
ఒక కాకి వాలెను ఆ కొమ్మ వాకిట
వరమైనది తన పంచమ స్వరగీతిక
వల వేసెను కసి మదనుడు తోలి వేటగ
తన ఇల్లు మారెను ఒక పంజరమ్ముగా
తన రూపు మారెను తనకే శరమ్ముగా
ఏ దేవుడు కలడీ భువనమున
ఎగిరే పావురమా
ఎదిగే యవ్వనమా
కలతో కాపురమా
కలతే వరమా
సుడిగాలి దీపమా
సడిలేని రాగమా
సుడిగాలి దీపమా
సడిలేని రాగమా
మనసైతే నేరమా
మమకార మేఘమా
మనసైతే నేరమా
మమకార మేఘమా
కన్నీరుగ కరిగే హృదయమున

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar