Kishore Kumar Hits

S.V.Krishna Reddy - Aaha Yemi Ruchi şarkı sözleri

Sanatçı: S.V.Krishna Reddy

albüm: Yegire Paavuramaa


ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరి మోజే తీరనిది
తాజా కూరలలో రాజా ఎవరండి
ఇంకా చెప్పాలా వంకాయేనండి
ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరి మోజే తీరనిది

అల్లం పచ్చిమిర్చి శుచిగా నూరుకొని
ఆ దానికి కొత్తిమిరి బాగా తగిలిస్తే
గుత్తొంకాయ కర్రీ ఆకలి పెంచుకదా
అది నా చేతుల్లో అమృతమే అవదా
ఒండుతూ ఉంటేనే రాదా
ఘుమఘుమ ఘుమఘుమ ఘుమఘుమలు
ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరి మోజే తీరనిది

లేత వంకాయలతో వేపుడు చేసేదా
మపద దనిసరీ రిద రిద గరిస నిసదప
మెట్ట వంకాయలతో చట్నీ చేసేదా
టొమాటోతో కలిపి వండిపెడితే మీరూ
అన్నమంత వదిలేసి ఒట్టి కూర తింటారు
ఒకటా రెండా మరి వంకాయ లీలలు
తెలియగ తెలుపగ తరమా
ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరి మోజే తీరనిది
తాజా కూరలలో రాజా ఎవరండి
ఇంకా చెప్పాలా వంకాయేనండి

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar