చలాకి చిలిపి వయసులో ఓ హొయ్...
అదేమి వింత ఉన్నదో ఓ హొయ్...
చలాకి చిలిపి వయసులో ఓ హొయ్...
అదేమి వింత ఉన్నదో ఓ హొయ్...
చలాకి చిలిపి వయసులో, అదేమి వింత ఉన్నదో,
సుఖాల వీణ మీటమన్నది...
♪
చలాకి చిలిపి వయసులో ఓ హొయ్...
అదేమి వింత ఉన్నదో ఓ హొయ్...
♪
కనులు కనులు కలుసుకున్న వేళలో...
ఎన్నెన్ని ఊహలో... ఎన్నెన్ని పులకరింతలో...
తనువు తనువు తడుముతున్న జోరులో...
హుషారు హోరులో... ఎన్నెన్ని జలదరింపులో...
పెదవి మధువులొలికెనెందుకో... హొయ్.
పడుచు వయసునడిగి తెలుసుకో... హొయ్...
వరాల కౌగిలింత లోని వింత ఇంతగా...
♪
చలాకి చిలిపి వయసులో ఓ హొయ్...
అదేమి వింత ఉన్నదో ఓ హొయ్ ...
♪
రేయి కురులు విప్పుకుంది రమ్మని...
అదేదొ ఇమ్మని... అదేమొ నీకె తెలుసనీ.
ఆశ తలుపు తెరుచుకుంది ఝుమ్మని...
ఊపందుకొమ్మనీ... ఉయ్యలలూగిపొమ్మనీ...
సొగసు అలసిపోయెనెందుకో... హొయ్...
హొయ్. పసిడిపరుపునడిగి తెలుసుకో... హాయ్.
మజాల ముగ్గులోకి దింపి నన్ను పంచుకో...
♪
చలాకి చిలిపి వయసులో ఓ హొయ్...
అదేమి వింత ఉన్నదో ఓ హొయ్ ...
చలాకి చిలిపి వయసులో, అదేమి వింత ఉన్నదో,
సుఖాల వీణ మీటమన్నది...
♪
ఉహూహు ఊహు ఉహూహు ఆహా
లలాల లాల లాలలా హా... హహహ
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri