నేలమీద జాబిలి సరేలే ఊహ కాని ఊర్వశీ చూడగానే సుందరి అదేలే మల్లె జాజిపందిరి తోడు కోరే వయస్సులాగా తొంగి చూసే మనస్సు లాగా ఊరికి వచ్చే ఉషస్సులాగా వరములిచ్చే తపస్సులాగా సితారలా మెరిసింది షికారుగా కలిసింది నేలమీద జాబిలి సరేలే ఊహ కాని ఊర్వశీ ♪ స్త్రీ దేవి చూపుతోనే శృంగార దీపమెట్టినట్టుగా సింధూర సంధ్య వేళ సిగ్గంతా బొట్టు పెట్టినట్టుగా ఆ బాల పిచ్చుక అందాలు గుచ్చగా వాలిందమ్మ గాలివాటుగా వయ్యారాల గాలి వీచగా పచ్చబొట్టు గుండె కేసి పైటచాటు చేసే చందమామ లంచమిచ్చి నూలుపోగు తీసి ఇదే తొలి అనుభూతి రచించని రస గీతి నేలమీద జాబిలి సరేలే ఊహ కాని ఊర్వశీ ♪ సంధ్య రాగం సఖీ సంగీతం పాడిన వేళ రాయని గంధం రాధిక అందం అంకితమై ఆమని సోకుల ఆమెని తాకిన అనుభవమే యదలకు లోతున పెదవుల మధ్యన సాగర మధనం మూగ తరంగం ♪ చెలి చూపు సోకగానే తొలిప్రేమ కన్ను కొట్టినట్టుగా లేలేత చీకటింట నెలవంక ముద్దు పెట్టినట్టుగా చూశాక ఆమెని కన్నుల్లో ఆమని వేసిందమ్మ పూల ముగ్గులే పట్టిందమ్మ తేనె ఉగ్గులే ఆమె మూగ కళ్ళలోన సామవేద గానం ఆమె చేయి తాకగానే హాయి వాయులీనం ఒకే క్షణం మైమరిచి అనుక్షణం ఆ తలపు నేలమీద జాబిలి సరేలే ఊహ కాని ఊర్వశీ చూడగానే సుందరి అదేలే మల్లె జాజిపందిరి తోడు కోరే వయస్సులాగా తొంగి చూసే మనస్సులాగా ఊరికి వచ్చే ఉషస్సులాగా వరములిచ్చే తపస్సులాగా సితారలా మెరిసింది షికారుగా కలిసింది