తత్ర గంధవతి పృథివి
నిత్య సహనవతి పృథివి
స్వచ్ఛ ప్రేమవతి పృథివి
స్థైర్య శక్తి వతి పృథివి
వందేహం పృథ్వి మాతరం
బుడి బుడి అడుగుతొ మొదలై
ఎన్నడుగులేసినా
ఎన్నిలో ఆరడుగులేరా శాశ్వతం
మణులను ఘనులను వలచి
ఎంతెంత తవ్వినా
మన్నులో కలిపెందుకే నువ్ అంకితం
దేనికోసం ఆరాటం మరి దేనికోసం ఈ అరాచకం
నిన్ను మోసే నేలతోనే ఆడకెప్పుడు పరాచకం
జననిగ తనయుని లాలించే ఆ వెచ్చటి మెత్తటి చేతితో
గడ గడ గడ గడ లాడించే భూకంపం తెస్తది కాసుకో
మట్టిలో కలిసిపో
మట్టిలో కలిసిపో
వందేహం పృథ్వి మాతరం
మంచిగ వీడిక యుద్ధ క్షేత్రం
దుర్జన వంజన మారణాస్త్రం
మరణం సమర శంఖం
కర్తవ్యం ఖననం
సాక్ష్యం విశాల గగనం
సాక్ష్యం విశాల గగనం
తధ్యం శత్రు మరణం
తధ్యం శత్రు మరణం
నాలుగు దిక్కుల మధ్యనా
నలుగురి కన్నులు కప్పినా
ఐదో దిక్కొకటున్నది పైనా
అది చూస్తున్నది నువ్వేమి చేసినా
శివమ్ శివమ్ భవ హరం హరం
శివమ్ శివమ్ భవ హరం హరం
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri