స్వాతిముత్యపు జల్లులలో
శ్రావణమేఘపు జావళిలో
స్వాతిముత్యపు జల్లులలో
శ్రావణమేఘపు జావళిలో
నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే
స్వాతిముత్యపు జల్లులలో
శ్రావణమేఘపు జావళిలో
స్వాతిముత్యపు జల్లులలో
శ్రావణమేఘపు జావళిలో
నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే
ముసురేసిందమ్మా
కబురే కసిగా తెలిపి
తడిగా ఒడినే దులిపి
జడివానేం చేస్తుంది జవరాలే తోడుంటే
తడిపేసిందమ్మా
తనువూ తనువూ కలిపి
తనతో సగమే చెరిపి
చలిగాలేం చేస్తుంది చెలికాడే తోడుంటే
ఆ మెరుపులకే మెలితిరిగే సొగసులతో
ఈ ఉరుములకే ఉలికిపడే వయసులతో
కురిసింది వాన తొలిగా పరువాన
స్వాతిముత్యపు జల్లులలో
శ్రావణమేఘపు జావళిలో
నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే
మతిపోయిందమ్మా
మనసు మనసు కలిసి
కథలు కళలు తెలిసి
జలపాతం నీవైతే అలగీతం నేనేలే
కసి రేగిందమ్మా
కలతో నిజమే కలిసి
దివిని భువిని కలిపి
సిరితారలు తెస్తాలే నీ విరులే చేస్తాలే
ఈ చిటపటకే శృతి కలిసే వలపులతో
ఈ తపనలకే జత కలిసే తలపులతో
కురిసింది వాన తొలిగా పరువాన
స్వాతిముత్యపు జల్లులలో
శ్రావణమేఘపు జావళిలో
స్వాతిముత్యపు జల్లులలో
శ్రావణమేఘపు జావళిలో
నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri