ఓయ్' రంగమ్మా మంగమ్మా...
ఓయ్' రంగమ్మా మంగమ్మా...
రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు
రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు
గొల్లభామ వచ్చి... నా గోరు గిల్లుతుంటే...
గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే
పుల్లచీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే
ఉఫ్ఫమ్మా ఉఫ్ఫమ్మా అంటూ ఊదడూ
ఉత్తమాటకైనా నన్ను ఊర్కోబెట్టడూ
ఉఫ్ఫమ్మా ఉఫ్ఫమ్మా అంటూ ఊదడూ
ఉత్తమాటకైనా నన్ను ఊర్కోబెట్టడూ
ఆడి పిచ్చి పిచ్చి ఊసుల్లోన మునిగి తేలుతుంటే
మరిచిపోయి మిరపకాయ కొరికినానంటే
మంటమ్మా మంటమ్మా అంటే సూడడూ
మంచినీళ్ళైనా సేతికియ్యడూ
మంటమ్మా మంటమ్మా అంటే సూడడూ
మంచినీళ్ళైనా సేతికియ్యడూ
ఓయ్' రంగమ్మా మంగమ్మా...
రంగమ్మా మంగమ్మా...
రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు
♪
హే... రామసిలకమ్మా...
రేగుపండు కొడుతుంటే...
రేగిపండు గుజ్జు వచ్చి కొత్తగా సుట్టుకున్న రైక మీద పడుతుంటే
హే' రామసిలకమ్మా రేగుపండు కొడితే
రేగిపండు గుజ్జు నా రైక మీద పడితే
మరకమ్మా మరకమ్మా అంటే సూడడూ
మారు రైకైనా తెచ్చి ఇయ్యడూ
మరకమ్మా మరకమ్మా అంటే సూడడూ
మారు రైకైనా తెచ్చి ఇయ్యడూ
రంగమ్మా మంగమ్మా...
రంగమ్మా మంగమ్మా...
రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు
♪
నా అందమంత మూటగట్టి...
అరె కందిసేనుకే ఎలితే...
ఆ కందిరీగలొచ్చి ఆడ ఈడ గుచ్చి నన్ను సుట్టుముడుతుంటే
నా అందమంత మూటగట్టి కందిసేనుకెలితే
కందిరీగలొచ్చి నన్ను సుట్టుముడుతుంటే
ఉష్షమ్మా ఉష్షమ్మా అంటూ తోలడూ
ఉలకడూ పలకడూ బండరాముడు
ఉష్షమ్మా ఉష్షమ్మ అంటూ తోలడూ
ఉలకడూ పలకడూ బండరాముడు
రంగమ్మా మంగమ్మా...
రంగమ్మా మంగమ్మా...
హేయ్' రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు
ఏయ్' రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ
పక్కనే ఉంటాడమ్మా 'పట్టించుకోడు'
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri