జయ జయ వేంకట శైలాధీశ
జయ జయ తిరుమల వాసా ఈశా
జయ జయ వేంకట శైలాధీశ
జయ జయ తిరుమల వాసా ఈశా
జయ పద్మావతీ హృదయా వాసా
జయ శ్రీనివాస శ్రీ వెంకటేశా
జయ జయ వేంకట శైలాధీశ
జయ జయ తిరుమల వాసా ఈశా
శరణము వేడితి వేంకట రమణ
నన్నేలగరా నీ కరుణ
శరణము వేడితి వేంకట రమణ
నన్నేలగరా నీ కరుణ
సర్వేశ శ్రీస సర్వ లోకేశ
నమ్మితి నిన్నే శ్రీ వేంకటేశా
జయ జయ వేంకట శైలాదీశ
జయ జయ తిరుమల వాసా ఈశా
అనయము మనసున నిన్నే తలచి
నీ శుభ నామము నోటను పలికి
అనయము మనసున నిన్నే తలచి
నీ శుభ నామము నోటను పలికి
చేతులారంగ నీ పూజ చేసి
నమ్మితి నిన్నే శ్రీ వేంకటేశా
జయ జయ వేంకట శైలాధీశ
జయ జయ తిరుమల వాసా ఈశా
పిలచిన పలికే దైవము నీవని
ప్రాణుల నడిపే చేతన నీవని
పిలచిన పలికే దైవము నీవని
ప్రాణుల నడిపే చేతన నీవని
సృష్టి స్థితి లయ కారణ మీవని
నమ్మితి నిన్నే శ్రీ వేంకటేశా
జయ జయ వేంకట శైలాధీశ
జయ జయ తిరుమల వాసా ఈశా
జయ పద్మావతీ హృదయా వాసా
జయ శ్రీనివాస శ్రీ వెంకటేశా
జయ పద్మావతీ హృదయా వాసా
జయ శ్రీనివాస శ్రీ వెంకటేశా
జయ జయ వేంకట శైలాధీశ
జయ జయ తిరుమల వాసా ఈశా
జయ జయ వేంకట శైలాధీశ
జయ జయ తిరుమల వాసా ఈశా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri