S. P. Sailaja - Siggoo Poobanthi (From "Swayam Krishi") şarkı sözleri
Sanatçı:
S. P. Sailaja
albüm: S Janaki - Birthday Special Telugu Hits
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
మొగ్గ
మొగ్గ తన
మొ మొగ్గ
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి, సిగ్
♪
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా
రాముని సిత్తంలో కాముడు చింతలు రేపంగా
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
♪
విరజాజి పూలబంతి అరసేత మోయలేని
విరజాజి పూలబంతి అరసేత మోయలేని
సుకుమారి ఈ సిన్నదేనా
శివుని విల్లు మోసిన జాణ ఈ సిన్నదేనా
ఔరా అని రామయ కన్నులు నేలమాడి నవ్విన సిన్నెలు
ఔరా అని రామయ కన్నులు నేలమాడి నవ్విన సిన్నెలు
సూసి అలకలొచ్చిన కలికి
సూసి అలకలొచ్చిన కలికి
ఏసినాది కులుకుల మొలికి
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
♪
సిరసొంచి కూరుసున్న గురుసూసి సేరుతున్న
సిరసొంచి కూరుసున్న గురుసూసి సేరుతున్న
చిలకమ్మ కొనసూపు సౌరు బొండు మల్లె చెండు జోరు
సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ్య రూపు
సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ్య రూపు
మెరిసే నల్ల మబ్బైనాది
మెరిసే నల్ల మబ్బైనాది
వలపు జల్లు వరదైనాది
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా
రాముని సిత్తంలో కాముడు చింతలు రేపంగా
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri