బంగారం సాంబ్రాణియు భోళమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా ఈ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట రంగు మరియు పై రూపము ప్రాముఖ్యం కానే కాదయ్యా అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయము బంగారం సాంబ్రాణియు భోళమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా ♪ స్వల్ప గ్రామమైన బెత్లహేము నుండి యూదా సింహము దీనురాలైన మరియ గర్భాన ఆది వాక్యము మానవుడై మహోన్నతుడు మహికి మహిమ తెచ్చెను మానవుడై మహోన్నతుడు మహికి మహిమ తెచ్చెను బంగారం సాంబ్రాణియు భోళమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా ♪ సొంత కుమారుడ్ని అప్పగించేను వెనుతీయక మన కొరకు ఆయన తోడ అనుగ్రహించెను సమస్తము కడవరకు పాపమై పరిశుద్ధుడు పాపికి విలువనిచ్చెను పాపమై పరిశుద్ధుడు పాపికి విలువనిచ్చెను బంగారం సాంబ్రాణియు భోళమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా ఈ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట రంగు మరియు పై రూపము ప్రాముఖ్యం కానే కాదయ్యా అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయము తందనే తానే ననే తందనానే తానా తందనే తానే న నాతానేనా తందనే తానే ననే తందనానే తానా తందనే తానే న నాతానేనా