మనసా మనసా సమయాల మాయ చూస్తున్నావా కనులే తెరిచి కాలాన్ని స్వాగతిస్తున్నావా మనసా మనసా సమయాల మాయ చూస్తున్నావా కనులే తెరిచి కాలాన్ని స్వాగతిస్తున్నావా దారులెన్నో ముందరున్నా తీరమైతే ఒకటేగా చేరుకున్న తీరమైనా నీకు సొంతం అవుతుందా గాలులెన్నో తాకుతున్నా ఊపిరయ్యేదొకటేగా నువ్వు పీల్చే ఊపిరైనా నీకు తోడై ఉంటుందా ఏమిటోలే ఈ మాయ, అసలేమిటోలే ఈ మాయ ఏమిటోలే ఈ మాయ, అసలేమిటోలే ఈ మాయ తామరాకుపై నీటిబొట్టులా ఉంది గుండెపై ప్రేమ సంతకం ఆవిరవ్వని నీటిరాతలా లోపలున్నది తీపి జ్ఞాపకం చీకటైతే ఆ వెన్నెల్లో, వేకువైతే ఆ వెలుగుల్లో హాయి చూడమంటున్నది ఈ లోకం చేరువైతే ఈ చూపుల్లో, దూరమైతే ఆ గురుతుల్లో దాగి ఉంటది ఆనందం మనసా ఏమిటోలే ఈ మాయ, అసలేమిటోలే ఈ మాయ ఏమిటోలే ఈ మాయ, అసలేమిటోలే ఈ మాయ ఎత్తుపల్లం లేని బాటని చూపలేవుగా నువ్వు నేలకి ఆటుపోటులు లేని జన్మని చూడలేముగా ఎన్ని నాళ్ళకీ ఎంత చిన్నదో ఆకాశం, ఆశ ముందర ఈ నిముషం వెతకమన్నది నీ సంతోషం కోసం అంతులేని ఈ ఆరాటం, ఆపమన్నది ఈ హృదయం పంపుతున్నది ఆహ్వానం మనసా ఏమిటోలే ఈ మాయ, అసలేమిటోలే ఈ మాయ ఏమిటోలే ఈ మాయ, అసలేమిటోలే ఈ మాయ మనసా మనసా సమయాల మాయ చూస్తున్నావా కనులే తెరిచి కాలాన్ని స్వాగతిస్తున్నావా మనసా మనసా సమయాల మాయ చూస్తున్నావా కనులే తెరిచి కాలాన్ని స్వాగతిస్తున్నావా దారులెన్నో ముందరున్నా తీరమైతే ఒకటేగా చేరుకున్న తీరమైనా నీకు సొంతం అవుతుందా గాలులెన్నో తాకుతున్నా ఊపిరయ్యేదొకటేగా నువ్వు పీల్చే ఊపిరైనా నీకు తోడై ఉంటుందా