ఏ కవితలనో తెలిపినవి కనులు ఇవే నా ఎద సడిలో శ్రుతి గతిని మార్చినవే ఊహించుకున్నా జన్మాలు వేలు, నీతో క్షణమే చాలు కదలాడెనే కలలా నిజం కరిగించకే సమయాన్నిలా లోలోన నీ మౌనాలని పలికించవే చిరునవ్వులా కనిపించే తీరం, తరిగేనా దూరం దరి చేరే సమయం వరమై రానా అందనిది అందం అందుకనే అందం అందరిలో తానే ఎంతో అందం చెలియా నీ చిటపటల చూపులతో చురకెందుకో రా చిగురెదలో చిరులతలా పెనవేసుకో మరీ చికాకై మరిచిక నువ్వే మరి మరి కోరే మనస్సు నీ నవ్వే బిడియపు మడి విడువడి ఇక మనసుని తెలిపేసెయవా కదలాడెనే కలలా నిజం కరిగించకే సమయాన్నిలా లోలోన నీ మౌనాలని పలికించవే చిరునవ్వులా ఏ కలతలిలా పరిచయమో నా ఎదకు నీ గతములలో ఒక శృతిగా ఊహించి నీతో జన్మాలు వేలు, పగిలే హృదయం చాలు కదలాడెనే కలలా నిజం కరిగించకే సమయాన్నిలా లోలోన నీ మౌనాలని పలికించవే చిరునవ్వులా (కదలాడెనే కలలా నిజం) (కరిగించకే సమయాన్నిలా) (లోలోన నీ మౌనాలని పలికించవే చిరునవ్వులా)