రాకాసి గడుసు పిల్ల
శివకాశి సరుకీ పిల్ల, ఎవరిదీ? ఎవరిదీ?
అల్లరి చేష్టల అమ్మాడి, ఆటల్లో గెలిచే కిల్లాడి
జింకలా చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తోంది, ఎవరిదీ?
ఎవరిదీ?
మా ఇంటి దేవత, మందార పూలత
ఊరంతా నీ జత
రెండు జళ్ళ చిన్ని సీత, బంగారు పిచ్చుక
చిన్నారి చంద్రిక
మా బుజ్జి గోపిక, సక్కంగున్న చిట్టి చిలక
♪
పెంకి పిల్లవే, కొంటె పిల్లవే
అమ్మ పోలికే వచ్చినాదిలే
పొట్టి పిల్లవే, గట్టి పిల్లవే
నాన్న కూచిలా పుట్టినావులే హే
నాన్న కన్న కల నిజమైయ్యేలా
నీకున్న ఇష్టమే తీరేలా
కన్నవా కలబడి, ఈ ఆట నెర్చైవా
♪
వెనకడుగు వెయ్యని వ్యూహంలా బరిలోకి నువ్వే దూకాల
చిన్నమ్మా నిలబడి నీ చురుకు చుపైవా
బుల్లి పిట్ట, బుజ్జి పిట్ట, పసి పాలపిట్ట
చిరునవ్వులిట్ట కురిసే
పూలబుట్ట పైడిగుట్ట, బుట్ట తేనపట్ట
వెండి వెన్నెలింట మేఘమల్లె నువ్వు మెరిసే
మా ఇంటి దేవత
తానా నాన్న తన్నాన నాన్న
మందార పూలత
♪
అల్లిబిల్లి జాబిలి నువ్వమ్మ
జాజి మల్లి కొమ్మకు చెల్లెమ్మ
చుర చురా చూడగా సూర్యుడే పరుగమ్మ
♪
కొండపల్లి బొమ్మే కౌసిమ్మ
పల్లె గుండె సవ్వడి నువ్వమ్మ
పుడమికే రంగులే నీ లేత నవ్వులమ్మ
బుల్లి బుగ్గలున్న తల్లి, చిన్న పాలవెల్లి
ఇంద్రధనసు మల్లె విరిసే
పల్లె పైర గాలి కేళి, చందనాల హొలీ
చల్లగుండమంటూ నిన్ను దీవెనల్లో ముంచే
రాకాసి గడుసు పిల్ల
శివకాశి సరుకీ పిల్ల, ఎవరిదీ? ఎవరిదీ?
అల్లరి చేష్టల అమ్మాడి, ఆటల్లో గెలిచే కిల్లాడి
జింకలా చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తోంది, ఎవరిదీ?
ఎవరిదీ?
మా ఇంటి దేవత, మందార పూలత
ఊరంతా నీ జత
రెండు జళ్ళ చిన్ని సీత, బంగారు పిచ్చుక
చిన్నారి చంద్రిక
మా బుజ్జి గోపిక, సక్కంగున్న చిట్టి చిలక
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri