Kishore Kumar Hits

Thirupathi Matla - Naa Sakkanoda şarkı sözleri

Sanatçı: Thirupathi Matla

albüm: Naa Sakkanoda


నమ్మి నానపోసినానురో నాయి దొరో
నా సక్కనోడో
నా సెక్కరిలోన సెందురుడా
బుచ్చి బుర్రలైనాయిరో నాయి దొరో
నా సక్కనోడో
నా సెక్కరిలోన సెందురుడా
మేనత్త కొడుకంటే మేకల పొద్దని
మందెంత చెప్పిన నువ్వే కావాలని
నమ్మి నానపోసినానురో నాయి దొరో
నా సక్కనోడో
నా సెక్కరిలోన సెందురుడా
బుచ్చి బుర్రలైనాయిరో
నాయి దొరో నా సక్కనోడో
నా సెక్కరిలోన సెందురుడా

కట్టు కున్న బొమ్మరిల్లు కోట
అమ్మానాన్నలాట
నువ్వు నేను గూడి
రాములోరి గుడి చేరి
లగ్గం మాడి నన్ను నాడే పెడ్లాడినావురో
నాయి దొరో నా సక్కనోడో
నా సెక్కరిలోన సెందురుడా
అవి యాదికొస్తే సిగ్గులాయరో
నాయి దొరో నా సక్కనోడో
నా సెక్కరిలోన సెందురుడా

ఈసాంత రమ్మంటే
ఇల్లంత నాదంటు గెలికినావు
ప్రేమలొలికినావు చూడబుద్ది కాక
నన్ను ఓర్వలేక నా యంట పడి
కొంటె ఆటలాడి
మూలకున్నదాన్ని ముంగటేత్తివిరో
నాయి దొరో నా సక్కనోడో
నా సెక్కరిలోన సెందురుడా
ఇప్పుడు ఎట్లకాని దానైతిరో
నాయి దొరో నా సక్కనోడో
నా సెక్కరిలోన సెందురుడా

పిలిచి పిల్లనిత్తే కులం లేదైనట్టు
ఈడు కాదా నీకు జోడు కాదా
పడుసుదాన్ని కాదా
గడసు తనములేదా
నీకు నచ్చలేదా నన్ను మెచ్చలేదా
మర్రి ఊడలాట మరిసినవా
నాయి దొరో నా సక్కనోడో
నా సెక్కరిలోన సెందురుడా
నీ పుర్రెలో పురుగులు సొచ్చినయా
నాయి దొరో నా సక్కనోడో
నా సెక్కరిలోన సెందురుడా

సెయ్యి పట్టుకొని జంట కట్టుకొని
వెంట తిప్పుకొని మాట తప్పవని
అన్ని ఒప్పుకొని కట కలపవని
కలలు కన్నదాన్ని
మానాల గుట్టలనడుగురో
నాయి దొరో నా సక్కనోడో
నా సెక్కరిలోన సెందురుడా
నువ్వు ఏసిన ఓట్టులు మరువరో
నాయి దొరో నా సక్కనోడో
నా సెక్కరిలోన సెందురుడా
మానాల గుట్టలనడుగురో
నాయి దొరో నా సక్కనోడో
నా సెక్కరిలోన సెందురుడా
నువ్వు ఏసిన ఓట్టులు మరువరో
నాయి దొరో నా సక్కనోడో
నా సెక్కరిలోన సెందురుడా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar