లక్ష్మీ కళ్యాణము లీలతో పాడేద మిదే నేము
లక్ష్మీ కళ్యాణము లీలతో పాడేద మిదే నేము
లక్ష్మీ నారాయణులే లలనయు నీవును
లక్ష్మీ కళ్యాణము లీలతో పాడేద మిదే నేము
లక్ష్మీ నారాయణులే లలనయు నీవును
లక్ష్మీ కళ్యాణము లీలతో పాడేద మిదే నేము
పాడేద మిదే నేము పాడేద మిదే నేము
చూపులు చూపులు మీకు సూసకము బాసికము
వూపచన్ను గుబ్బలివి బూజగుండలు
చూపులు చూపులు మీకు సూసకము బాసికము
వూపచన్ను గుబ్బలివి బూజగుండలు
తీపుల మోవితేనెలు తీరని మధు పర్కములు
తీపుల మోవితేనెలు తీరని మధు పర్కములు
దాపుగ బెండ్లి యాడరయ్య తగుదగు మీకును
లక్ష్మీ కళ్యాణము లీలతో పాడేద మిదే నేము
లక్ష్మీ నారాయణులే లలనయు నీవును
లక్ష్మీ కళ్యాణము లీలతో పాడేద మిదే నేము
పాడేద మిదే నేము
మాటలు మీ కిద్దరికి మదన మంత్రములు
మేటితలబాలు మీలో మించు నవ్వులు
మాటలు మీ కిద్దరికి మదన మంత్రములు
మేటితలబాలు మీలో మించు నవ్వులు
గాటమైన పులకలు కప్పురవసంతాలు
గాటమైన పులకలు కప్పురవసంతాలు
నీతున పెండ్లాడరయ్య నెరవేరె మీకును
లక్ష్మీ కళ్యాణము లీలతో పాడేద మిదే నేము
లక్ష్మీ నారాయణులే లలనయు నీవును
లక్ష్మీ కళ్యాణము లీలతో పాడేద మిదే నేము
పాడేద మిదే నేము
కౌగిలి కౌగిలి మీకు కందువ పెండ్లి చవికె
పాగిన కోరికలే పావకోళ్ళు
కౌగిలి కౌగిలి మీకు కందువ పెండ్లి చవికె
పాగిన కోరికలే పావకోళ్ళు
ఆగిన శ్రీవేంకటేశ అలమేలుమంగా నీవు
ఆగిన శ్రీవేంకటేశ అలమేలుమంగా నీవు
వీగక పెండ్లాడవయ్య వేడుకాయమీకును
లక్ష్మీ కళ్యాణము లీలతో పాడేద మిదే నేము
లక్ష్మీ నారాయణులే లలనయు నీవును
లక్ష్మీ కళ్యాణము లీలతో పాడేద మిదే నేము
పాడేద మిదే నేము
పాడేద మిదే నేము పాడేద మిదే నేము
(దిలీప్ చక్రవర్తి)
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri