ఇది మత్తెక్కించే పొద్దురా
నువు రావా వొళ్ళోకి
ఇరు కన్నులు ఆడే వేటరా
నువు రావా నాలోకి
కన్నుల్తో పెదవే పలుకునా
కౌగిట్లో పరువం చేరునా
కవ్వించే మనసే ఆగునా
క్షణమైనా నిదురే పోవునా
నీవే నీవే నీవేలే చిరు జ్వాలే
తాకే కొద్దీ రేగెలే
నీవే నీవే నీవేలే ఇరు జ్వాలే
రేగే కొద్దీ తీరెలే
సుందరాంగిని రాంగిని రాంగిని నన్ను రమ్ములోన ముంచు
కసి కామిని కామిని కామిని దరిచేరి దప్పి తీర్చూ
నను మింగని మింగని మింగని నీ వగల నల్ల తాచు
ఇక చంపని చంపని చంపని కొనచూపే గుచ్చి నవ్వే చిచ్చు
నీవే నీవే నీవేలే చిరు జ్వాలే
తాకే కొద్దీ రేగెలే
నీవే నీవే నీవేలే ఇరు జ్వాలే
రేగే కొద్దీ తీరెలే
♪
సొగసైన వాక్యం నువ్వైతే సిగ్గే కాదా comma
అరె తేట తెలుగే మురిసిందే నిన్నే వర్ణించామా
అణువులు ఎరుగవు నీలో విద్యుత్తే
అనుకువలెరుగదు పెదవుల కవ్వింతే
అధరాలు రెండు ఆరకుండ చిందిస్తుంటే తేనే
క్షణమాగలేని ప్రాణమింక దాక్కుంటుందా లోనే
ఇది కాలు దువ్వి కాక రేపి ఊరించేటి దూరం
మోహాలాటకి ముద్దే శ్రీకారం
నీవే నీవే... ఏ... ఏ... ఏ...
నీవే నీవే నీవేలే చిరు జ్వాలే
తాకే కొద్దీ రేగెలే
నీవే నీవే నీవేలే ఇరు జ్వాలే
రేగే కొద్దీ తీరెలే
♪
మృదువైన సోకే సూదల్లే ఎదనే గుచ్చిందమ్మో
పొగవేమి లేని అందాలే గారాలొలికాయమ్మో
తరగని సిరులే రేపే కల్లోలం
కనికట్టు కలలే నాలో ధారాళం
జడివాన లేని జాములోన మెరుపే నేను చూశా
నడయాడు పూల తోటలోన కురిసే మేఘం చూశా
తెలి మంచులాంటి నవ్వులెన్నో పంచే గువ్వని చూశా
నిప్పు తేనే నీలోనే చూశా
నీవే నీవే నీవేలే చిరు జ్వాలే
తాకే కొద్దీ రేగెలే
నీవే నీవే నీవేలే ఇరు జ్వాలే
రేగే కొద్దీ తీరెలే
సుందరాంగిని రాంగిని రాంగిని నన్ను రమ్ములోన ముంచు
కసి కామిని కామిని కామిని దరి చేరి దప్పి తీర్చూ
నను మింగని మింగని మింగని నీ వగల నల్ల తాచు
ఇక చంపని చంపని చంపని కొనచూపే గుచ్చి నవ్వే చిచ్చు
నీవే నీవే నీవేలే చిరు జ్వాలే
తాకే కొద్దీ రేగెలే
నీవే నీవే నీవేలే ఇరు జ్వాలే
రేగే కొద్దీ తీరెలే
ఓ ఓ ఓ, ఓ ఓ ఓ
తాకే కొద్దీ రేగెలే
ఓ ఓ ఓ, ఓ ఓ ఓ
రేగే కొద్దీ తీరెలే
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri