Kishore Kumar Hits

Muralidhar - Cherukora Niyamamto şarkı sözleri

Sanatçı: Muralidhar

albüm: Siva Deeksha Mala


చేరుకోరా నియమంతో శ్రీశైలం
శివ దీక్షే మోక్షానికి ఆధారం
చేరుకోరా నియమంతో శ్రీశైలం
శివ దీక్షే మోక్షానికి ఆధారం
శివ శబ్ధం మహత్తరం
స్మరించురా నిరంతరం
శివం అనగా శుభం మోక్షం
హారోం హరా అంటాం కదూ
చేరుకోరా నియమంతో శ్రీశైలం
శివ దీక్షే మోక్షానికి ఆధారం

ఎంతో మహిమ ఉన్న
శివ దీక్షను మరువకన్న
(శివాయ ఓం నమో)
(శివాయ ఓం)
మోక్షమునిచ్చునన్న
సన్మార్గము చూపునన్న
(శివాయ ఓం నమో)
(శివాయ ఓం)
మండల కాలమంటే
నలుభదినాళ్ళు అగునన్న
(శివాయ ఓం నమో)
(శివాయ ఓం)
ఇరువది ఒక్క రోజు
అర్ధ మండలమన్న
(శివాయ ఓం నమో)
(శివాయ ఓం)
కామ క్రోధాదులను
వదులుకోరా జయించరా
కామ క్రోధాదులను
వదులుకోరా జయించరా
శివుని నమ్ముకొన్నవారు
పరమపదం చేరుతారు
చేరుకోరా నియమంతో శ్రీశైలం
శివ దీక్షే మోక్షానికి ఆధారం

తేనె నెయ్యి పంచదార
చందనము విబూధి
(శివాయ ఓం నమో)
(శివాయ ఓం)
కుంకుమము మంచి బియ్యం
టెంకాయను అగరుబత్తి
(శివాయ ఓం నమో)
(శివాయ ఓం)
పూజ కొరకు బిల్వ దళం
మరువకుండా తేవాలి
పూజ కొరకు బిల్వ దళం
మరువకుండా తేవాలి
తేరా కందర వర్ణం
వస్త్రంమొకటి జ్యోతిర్ముడికి ఆ
చేరుకోరా నియమంతో శ్రీశైలం
శివ దీక్షే మోక్షానికి ఆధారం

మాలాకాగడ మంత్రం
భక్తితోన జపించాలి
(శివాయ ఓం నమో)
(శివాయ ఓం)
జపించుతూ రుద్రాక్షను
మెడలోన ధరించాలి
(శివాయ ఓం నమో)
(శివాయ ఓం)
భోగాలు భాగ్యాలు
దీక్షలోన మరవాలి
భోగాలు భాగ్యాలు
దీక్షలోన మరవాలి
శివునియందు మనసు నిలిపి
దీక్ష కాలం గడపాలి ఆ
చేరుకోరా నియమంతో శ్రీశైలం
శివ దీక్షే మోక్షానికి ఆధారం

జ్యోతిర్ముఖి ధరియించి
శివ స్వాములుగా మారి
(శివాయ ఓం నమో)
(శివాయ ఓం)
పర్వ దినం శివరాత్రి
శ్రీశైలం పయనించు
(శివాయ ఓం నమో)
(శివాయ ఓం)
దారంతా శివ నామం
జపించుతూ సాగాలి
(శివాయ ఓం నమో)
(శివాయ ఓం)
హుండీలో ముడుపులేసి
శ్రీశైలుని ప్రార్ధించు
హుండీలో ముడుపులేసి
శ్రీశైలుని ప్రార్ధించు
మనసులో కోరిక తెలిపి
వేడుకోరా ఆ శివుని ఆ
చేరుకోరా నియమంతో శ్రీశైలం
శివ దీక్షే మోక్షానికి ఆదారం

జ్యోతిర్లింగాలకు నిలయమై శ్రీశైలం
(శివాయ ఓం నమో)
(శివాయ ఓం)
దర్శించే మధుర క్షణం
విజయాలకు శ్రీకారం
(శివాయ ఓం నమో)
(శివాయ ఓం)
శివుని ఆలంబనగా
చేసుకొని దీక్షబూని
(శివాయ ఓం నమో)
(శివాయ ఓం)
శ్రీశైలం చేరుకొన్న
బ్రతుకు ధన్యమగునన్న
(శివాయ ఓం నమో)
(శివాయ ఓం)
దీక్షలలో శివదీక్ష
మహత్తరమైనదంట
దీక్షలలో శివదీక్ష
మహత్తరమైనదంట
నమ్మి కొలుచువాడినెల్లా
శ్రీశైలుడు బ్రోచునంట ఆ
చేరుకోరా నియమంతో శ్రీశైలం
శివ దీక్షే మోక్షానికి ఆధారం
శివ శబ్ధం మహత్తరం
స్మరించురా నిరంతరం
శివపరగా శుభం మోక్షం
హారోం హరా అంతుకదు
చేరుకోరా నియమంతో శ్రీశైలం
శివ దీక్షే మోక్షానికి ఆధారం
(శివ దీక్షే మోక్షానికి ఆధారం)
(శివ దీక్షే మోక్షానికి ఆధారం)

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar