Allari Naresh - Priyathama Priyathama şarkı sözleri
Sanatçı:
Allari Naresh
albüm: Kotha Kothagaa
ప్రియతమా! ప్రియతమా! పలికినది హృదయమే సరిగమ
చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమ
చెలి చూపు తాకినా, ఉలకవా పలకవా
వలవేసి వేచి చూస్తున్నా, దొరకనే దొరకవా
(ఇష్టమైన సఖుడా! ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా
చక్కనైన చుక్కరా! చక్కనైన చుక్కరా
నిన్ను కోరుకుందిరా సుందరా)
ప్రియతమా! ప్రియతమా! పలికినది హృదయమే సరిగమ
చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమ
నీ ప్రేమలో ఆరాధనై నే నిండుగా మునిగాక
నీ కోసమే రాశానుగా నా కళ్లతో ప్రియలేఖ
చేరునో చేరదో తెలియదు ఆ కానుక
ఆశనే వీడక వెనకపడెను మనసుపడిన మనసే
(ఇష్టమైన సఖుడా! ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా)
ఉన్నానిలా ఉంటానిలా నీ నీడగా కడదాక
కన్నీటిలో కార్తీకపు దీపాన్నిరా నువులేక
దూరమే భారమై కదలదు నా జీవితం
నీవు నా చేరువై నిలిచి మసలు మధురక్షణములెపుడో
ప్రియతమా! ప్రియతమా! పలికినది హృదయమే సరిగమ
చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమ
చెలి చూపు తాకినా, ఉలకవా పలకవా
వలవేసి వేచి చూస్తున్నా, దొరకనే దొరకవా
(ఇష్టమైన సఖుడా! ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా
చక్కనైన చుక్కరా! చక్కనైన చుక్కరా
నిన్ను కోరుకుందిరా సుందరా)
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri