పిలిచినా రానంటావా కలుసుకోలేనంటావా
నలుగురూ ఉన్నారంటావా ఓ ఓ
చిలిపిగా చెంతకు రాలేవా
తెలివిగా చేరే తోవ తెలియనే లేదా బావ
అటూఇటూ చూస్తూ ఉంటావా ఓ ఓ
తటపటాయిస్తూ ఉంటావా
సమయం కాదంటావా సరదా లేదంటావా
సరసం చేదంటావా బావా
చనువే తగదంటావా మనవే విననంటావా
వరసై ఇటు రమ్మంటే నా మాట మన్నించవా
డోలు బాజాలా ఇలా నా వెంటపడతావా
చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా
హె' డోలు బాజాలా ఇలా నా వెంటపడతావా
చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా
కనులుంటే సొగసే కనపడదా
మనసుంటే తగుమార్గం దొరకదా... రాననక (రాననక)
అనుకుంటే సరిపోదే వనిత
అటుపై ఏ పొరబాటో జరగదా... రమ్మనక (రమ్మనక)
పెరిగిన దాహం తరగదే పెదవులు తాకందే
తరిమిన తాపం తాళదే మదనుడి బాణం తగిలితే
చాల్లే బడాయి నాతో లడాయి తగ్గించవోయి అబ్బాయి
హవ్వా హవ్వాయి అమ్మో అమ్మాయి విన్నానులే (break it down)
హవ్వా హవ్వాయి అమ్మో అమ్మాయి విన్నాం కదా నీ సన్నాయి
హవ్వా హవ్వాయి అమ్మో అమ్మాయి విన్నాం కదా నీ సన్నాయి
పిలిచినా రానంటావా కలుసుకోలేనంటావా
నలుగురూ ఉన్నారంటావా ఓ ఓ
చిలిపిగా చెంతకు రాలేవా
మొహమాటం పడతావా అతిగా
సుకుమారం చిటికేస్తే చొరవగా... చేరవుగా (చేరవుగా)
ఇరకాటం పెడతావే ఇదిగా
అబలా నీ గుబులేంటే కుదురుగా... ఆగవుగా (ఆగవుగా)
దరిశనమిస్తే సులువుగా అలుసుగ చూస్తావా
సరసకు వస్తే దురుసుగా మతి చెడిపోదా మరదలా
వరాల బాల వరించు వేళ తరించనంటూ తగువేల
నిగారమిట్టా జిగేలనాలా జనం చెడేలా (everybody)
నిగారమిట్టా జిగేలనాలా జనం చెడేలా జవరాలా
నిగారమిట్టా జిగేలనాలా జనం చెడేలా జవరాలా
తన్నాన నానే తన్నాన నానే తన్నాన నానే తననాన
తన్నాన నానే తన్నాన నానే తన్నాన నానే తననాన
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri