Mano - Chelimeeda (From "Gayam") şarkı sözleri
Sanatçı:
Mano
albüm: Mano 90'S Tollywood Superhits
చెలి మీద చిటికెడు దయ రాదా
అసలే చలి కాదా మనవేదో వినరాదా
వినలేదా అరెరె అనలేదా
అయినా సరిపోదా ఎదురొస్తే మరియాద
ఊ ఇంతేనా మాటలతో పోయే మంటేనా
ఈ కంగారే కళ్యాణం కోసం కయ్యాలా
♪
మనవేదో వినరాదా
♪
ఎదురొస్తే మరియాద
♪
ఇంత కాలం అందలేదా
పరి పరి విధముల పరువము
పంపిన లేఖలు
అంత దూరం లేను కదా
సూటిగ అడగక దేనికి
తికమక సైగలు
కన్య చాటు బిడియం
కన్ను చాటు వివరం
కంచ దాటి దూకలేదుగా
ఉన్న మాట కాస్తా విన్నవించుకుంటే
సంగతేదో చూడవచ్చుగా
ఆదుకొందుకు బాధలెందుకు తగువేదో తేల్చవా
చెలి మీద చిటికెడు దయ రాదా
అసలే చలి కాదా మనవేదో వినరాదా
వినలేదా అరెరె అనలేదా అయినా
సరిపోదా ఎదురొస్తే మరియాదా
♪
ఆశ లేకేం బోలెడంత అవసరమిది
అని తెగబడి అడుగుట తేలికా
దాచుకుంటే ఊరుకుందా పిడికెడు నడుముకు
సొగసులు బరువై తూలక
నీతి బోధ మాను చెంత చేరినాను
చేతనైన సాయమియ్యవా
ఏమి లాభమంట లేని పోని చింత
మానవేమి ఎంత పోరినా
పాల ముంచినా నీట ముంచినా
నీదేగా భారము
చెలి మీద చిటికెడు దయ రాదా
అసలే చలి కాదా మనవేదో వినరాదా
వినలేదా అరెరె అనలేదా అయినా
సరిపోదా ఎదురొస్తే మరియాద
ఊ ఇంతేనా మాటలతో పోయే మంటేనా
ఈ కంగారే కళ్యాణం కోసం కయ్యాలా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri