Kishore Kumar Hits

Raj-Koti - Muddula Chiliki şarkı sözleri

Sanatçı: Raj-Koti

albüm: Peddarikam


ముద్దుల జానకి పెళ్ళికి
మబ్బుల పల్లకి తేవలనే
(ముద్దుల జానకి పెళ్ళికి)
(మబ్బుల పల్లకి తేవలెనే)
ఆశల రెక్కల హంసలు
పల్లకి మోసుకు పోవలనే
(ఆశల రెక్కల హంసలు)
(పల్లకి మోసుకు పోవలెనే)
మురిపాల తేలించ మునిమాపులో
దివి నుండి రేరాజు దిగి వచ్చులే

ముద్దుల జానకి పెళ్ళికి
మబ్బుల పల్లకి తేవలనే
ఆశల రెక్కల హంసలు
పల్లకి మోసుకు పోవలనే
(తొలకరిలా వలపంతా కురిసెనులే)
(తీయని ఊహలు చిగురు తొడిగెను)

నింగిని తాకే పందిరి వేసి

పచ్చని పల్లెను పీటగ జేసి

నింగిని తాకే పందిరి వేసి
పచ్చని పల్లెను పీటగ జేసి
బంగారు రంగులు వేయించరారే
మురిపాల పెళ్లి జరిపించరారే
వధువు సొగసంత మెరిసే
వలపు మదిలోన విరిసే
చిలిపి కోరికలు కురిసే
పడుచు పరువాలు బిగిసే
కనివిని ఎరుగని కమ్మని భావన
కధలుగా కనిపించే

ముద్దుల జానకి పెళ్ళికి
మబ్బుల పల్లకి తేవలనే
ఆశల రెక్కల హంసలు
పల్లకి మోసుకు పోవలనే

తూరుపు ఎరుపై మనసులు పాడే

గోదావరిలా మమతలు పొంగే

తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
రాయంచలన్నీ రాగాలు తీసే
చిలకమ్మలెన్నో చిత్రాలు చేసే
కదలి రావమ్మ నేడే
కలలు పండేటి వేళ
వేచియున్నాడు వరుడే
సందె సరసాల తేల
సరసపు వయసున ఒంపుల సొంపుల
సరిగమ వినిపించి

ముద్దుల జానకి పెళ్ళికి
మబ్బుల పల్లకి తేవలనే
ఆశల రెక్కల హంసలు
పల్లకి మోసుకు పోవలనే
మురిపాల తేలించ మునిమాపులో
దివి నుండి రేరాజు దిగి వచ్చులే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar