ప్రియతమా ప్రియతమా తరగని పరువమా తరలి రా, తరలి రా కన్నె గోదారిలా, కొంటె కావేరిలా నిండు కౌగిళ్ళలో చేరరావే ప్రియతమా ప్రియతమా తరగని విరహమా తరలి రా, తరలి రా మాఘమాసానివై, మల్లెపూమాలవై నిండు నా గుండెలో ఊయలూగ ప్రియతమా ప్రియతమా తరగని పరువమా తరలి రా, తరలి రా నీ ఆశలన్నీ నా శ్వాసలైనా ఎంత మోహమో నీ ఊసులన్నీ నా బాసలైనా ఎంత మౌనమో ఎవరేమి అన్నా ఎదురీదనా సుడుగాలినైనా ఒడిచేరనా నీడల్లే నీవెంట నేనుంటా నా ప్రేమ సామ్రాజ్యమా ప్రియతమా ప్రియతమా తరగని విరహమా తరలి రా, తరలి రా పెదవుల్ని తడిపే పుడుతుంది తేనె తియ్యతియ్యగా కౌగిట్లో పడితే పుడుతుంది వాన కమ్మకమ్మగా వెన్నెల్ల మంచం వేసేయనా ఏకాంత సేవ చేసేయనా వెచ్చంగా చలి కాచుకోవాలా నీ గుండె లోగిళ్ళలో ప్రియతమా ప్రియతమా తరగని పరువమా తరలి రా, తరలి రా కన్నె గోదారిలా, కొంటె కావేరిలా నిండు కౌగిళ్ళలో చేరరావే ప్రియతమా ప్రియతమా తరగని విరహమా తరలి రా, తరలి రా