Kishore Kumar Hits

Raj-Koti - Pasvaado Emito şarkı sözleri

Sanatçı: Raj-Koti

albüm: Sitha Rathnam Gari Abbaye


పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు
వేధించే పంతాలు ఏమిటో
వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో
పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు

తాళెరుగని తల్లొక్కరు, తోడెరుగని మోడొక్కరు
కొడుకుండి తండ్రవలేక, సతులుండి పతి కాలేక
తన తలరాతకు తలవంచి శిలలాగే బ్రతికేదొకరు

బంధాలే సంకెళ్ళు వేయగా
బ్రతుకంతా చెరసాల లాగ మరగా
పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు

చేజేతులా ఏ ఒక్కరు ఏ నేరము చేసెరగరు
తెలిసెవరూ దోషులు కారు, ఫలితం మాత్రం మోశారు
పరులంటూ ఎవరూ లేరు అయినా అంతా పగవారు

ఇకనైనా ఈ మంటలారునా
ఇకనైనా ఈ జంట చెంత చేరునా
పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు
వేధించే పంతాలు ఏమిటో
వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో
పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar