Kishore Kumar Hits

Raj-Koti - Swathilo Muthyamantha şarkı sözleri

Sanatçı: Raj-Koti

albüm: Bangaru Bullodu


స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా
అల్లో మల్లో
అందాలెన్నో యాలో యాల

తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ
మేనక మెరపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ
శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమ లయనీదమ్మ
వానా వానా వల్లప్పా వాటేస్తేనే తప్పా
సిగ్గు యెగ్గూ చెల్లెప్పా కాదయ్యో నీ గొప్పా
నీలో మేఘం నాలో దాహం యాలో యాల
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా

తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన
జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
వానల్లోన సంపెంగ ఒళ్ళంతా ఓ బెంగా
గాలి వాన గుళ్ళోనా ముద్దే లే జేగంట
నాలో రూపం నీలో తాపం యాలో యాల
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా
అల్లో మల్లో
అందాలెన్నో
యాలో యాల

(వానా వానా వచ్చేనంట
వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట
తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా
కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి
పరవళ్ళెత్తి పరిగెత్తంగా)

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar