Kishore Kumar Hits

Joshua Sridhar - Yevevo Kalale şarkı sözleri

Sanatçı: Joshua Sridhar

albüm: Genius


(ఏవేవో)
కలలే కలలే కలలోన నువ్వే నువ్వే
(ఎన్నెన్నో)
కధలే కధలే కధలన్నీ నీవే నీవే
(ఏవేవో)
కలలే కలలే కలలోన నువ్వే నువ్వే
(ఎన్నెన్నో)
కధలే కధలే కధలన్నీ నీవే నీవే
నువ్వే నా ముందరుంటే చాలు కల నిజమై నన్ను చేరుతుంది
నువ్వు పక్కనుంటే చాలు కధలా బతుకు సాగుతుంది
నీతో మాటలాడుతుంటే నిమిషంలో రోజు పూర్తయింది
నువు మాటలాడకుంటే నిమిషం ఓ రోజులాగ ఉంది
నీకు తెలియాలి నాలోన జరిగే ఇది అని అంటోంది నా ప్రాణమే
నీకు తెలిపేందుకేంచేయగలదో మరి తన భాషేమో ఈ మౌనమే
(ఏవేవో)
కలలే కలలే కలలోన నువ్వే నువ్వే
(ఎన్నెన్నో)
కధలే కధలే కధలన్నీ నీవే నీవే

పెదవికి తెలియదు వేరే పలుకును ఒక నీ పేరే
హృదయము అడగదు వేరే నిను కోరే కోరే
పాదము వెతకదు వేరే తను కదులును కద నీ దారే
మనసుకు నచ్చదు వేరే నీ తీరే తీరే
నీపై కోపమొస్తే నన్ను నేనె తిట్టుకుంటునే ఉంట
నువు నవ్వుతుంటే నాకు నేనె ముద్దుపెట్టుకుంట
దూరం నుంచి నిన్ను చూసుకుంటూ మురిసిపోతూనే ఉంట
నువ్వు చేరువైతే సిగ్గు పడుతుంటా

వెలుతురు అంటే ఇష్టం
మది నిను చూపుతూ ఉంది
ఎపుడు ఆ చూపులనే యద కావాలంది
చీకటి అంటే ఇష్టం
నిను గురుతుకు తెస్తూ ఉంది
ఎపుడు ఆ గురుతులలో మది ఉంటా నంది
నాకు నువ్వు తప్ప ఎవరున్నా తీర్చలేరు నీ లోటు
నువ్వు సొంతమైతే చింతలేదు వందయేళ్ళ పాటు
నాలో నీకు తప్ప ఎవరికీ నే ఉంచలేదులే చోటు
నిను వీడి నేను ఉండలేనంటూ

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar