Kishore Kumar Hits

R. Madhavan - Mounalu Elane şarkı sözleri

Sanatçı: R. Madhavan

albüm: Run


మౌనాలు ఏలనే ప్రేయసి
నీ మౌనాలే రాగాలు ప్రేయసి
మౌనాలు ఏలనే ప్రేయసీ
నీ మౌనాలే రాగాలు ప్రేయసి
కళ్ళతో కళ్ళలో జూదమాడకే
వేళ్ళతో చేతిలో గీత మార్చకే
మాటలతో కవ్వించి
చూపులతో ఊరించి
ఆశలనే కలిగించి
కలలోకి అరుదించి
మౌనాలు ఏలనే ప్రేయసీ
నీ మౌనాలే రాగాలు ప్రేయసి
అల్లరి చేసే పువ్వుల మొక్కను చూశా
రహస్యముగానే మదినే తొవ్వి పదిలం చేసి వేశా
నిన్ను చూసి ఈడే కోరుకుంది తోడే
నన్ను వీడి విడిగా విడిపోయే నీడే
అరె మెరిసే మెరుపా నక్షత్రాల తలుకా ఎగిరిరావే నా చిలకా
మాటలతో కవ్వించి
చూపులతో ఊరించి
ఆశలనే కలిగించి
కలలోకి అరుదించి
మౌనాలు ఏలనే ప్రేయసి
నీ మౌనాలే రాగాలు ప్రేయసి
వానకు అర్దం ఒక చినుకే నా చెలియా
నువ్వు ఒంటరి చినుకా నీటి వరదానిజమును చెప్పవే సఖియా
బుగ్గసొట్టలోనా చిక్కుకొంటి మైనా
కొప్పుముడి వలన తప్పుకొంటి లలనా
అరె చందనాల చనుకా మల్లెపూల మొలకా సిగ్గువీడి రా వెనుకా
ఆగమంటు ఖండించి
లోలోపల దండించి
చెప్పమంటూ అర్దించి
చెప్పకుండ వంచించి
మౌనాలు ఏలనే ప్రేయసీ
నీ మౌనాలే రాగాలు ప్రేయసి
కళ్ళతో కళ్ళలో జూదమాడకే
వేళ్ళతో చేతిలో గీత మార్చకే
మాటలతో కవ్వించి
చూపులతో ఊరించి
ఆశలనే కలిగించి
కథలోకి అరుదించి

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar