ఒక్కరంటె ఒక్కరు ఇద్దరంటె ఇద్దరు ఒక్కరంటె ఒక్కరు ఇద్దరంటె ఇద్దరు ఒక తనువున ఎదిగిన కవలలు ఒక తీరున కదలని తలపులు ఒకరికొకరుగా మీరు కలిసుంటే చాలు అమ్మకదే పదివేలు ఒక్కరంటె ఒక్కరు ఇద్దరంటె ఇద్దరు విడి విడి కుడి ఎడమలుగా కలవనంటు ఎందుకలా చెరి సగమున కలివిడిగా ఒదగమంది అమ్మ కల చెరో చెయ్యి మీదిగా చెంప నిమిరితే చాలు మరో వరమె లేదనుకుంటూ మెరిసిపోవా నా చిరు నవ్వులు ఒక్కరంటె ఒక్కరు ఇద్దరంటె ఇద్దరు అన్న వెంట అడవులకేగిన లక్ష్మణుడే ఆదర్శం అరమరికలు దాటి సాగితే అడుగడుగు మధుమాసం నా కలలకు రెక్కలు మీరు నా ఎనిమిది దిక్కులు మీరు సంబరాల మీ సహవాసమె నే కోరిన సంతోషం మీ ఇద్దరి ఒద్దిక చూస్తూ గడవాలి నా ప్రతి నిమిషం ఒకరికొకరుగా మీరు కలిసుంటే చాలు అమ్మకదే పదివేలు ఒక్కరంటె ఒక్కరు ఇద్దరంటె ఇద్దరు ఒక్కరంటె ఒక్కరు ఇద్దరంటె ఇద్దరు