Kishore Kumar Hits

Shekar Chandra - Baguntundhi Nuvvu Navvithe şarkı sözleri

Sanatçı: Shekar Chandra

albüm: Atithi Devobhava (Original Motion Picture Soundtrack)


బాగుంటుంది నువ్వు నవ్వితే
బాగుంటుంది ఊసులాడితే
బాగుంటుంది గుండెమీద గువ్వలాగ నువ్వు వాలితే
బాగుంటుంది నిన్ను తాకితే
బాగుంటుంది నువ్వు ఆపితే
బాగుంటుంది కంటికున్న కాటుకంతా ఒంటికంటితే
అహాహాహాహా బాగుంది వరస
నీమీద కోపం ఎంతుందో తెలుసా
లాలిస్తే తగ్గిపోతుంది బహుశా
ఈ మనసు ప్రేమ బానిస
అయితే బుజ్జగించుకుంటానే
నిన్నే నెత్తినెట్టుకుంటానే
నువ్వే చెప్పినట్టు వింటానే
చెలి చెలి జాలి చూపవే

తడి చేసేద్దాం పెదవులని
ముడి వేసేద్దాం మనసులని
దాచేసుకుందాం మాటలని
దోచేసుకుందాం హాయిని
కాదంటానేంటి చూస్తూ నీ చొరవ
వద్దన్నకొద్దీ చేస్తావు గొడవ
నీనుంచి నేను తప్పుకోడం సులువా
కౌగిళ్ళలోకి లాగవా
అమ్మో! నువ్వు గడుసు కదా
అన్నీ నీకు తెలుసు కదా (తెలుసు కదా)
అయినా బయటపడవు కదా (పడవు కదా)
పదా పదా ఎంతసేపిలా

వెలివేసేద్దాం వెలుతురుని
పరిపాలిద్దాం చీకటిని
Hmm' పట్టించుకుందాం చెమటలని
చుట్టేసుకుందాం ప్రేమని
నువ్వేమో పెడుతుంటే తొందరలు
నాలోన సిగ్గు చిందరవందరలు
అందంగా సర్దుతూ నా ముంగురులు
మూసావు అన్ని దారులు
కొంచెం వదిలానంటే నిన్నిలా
మొత్తం జారిపోవా వెన్నెల
వేరే దారిలేక నేనిలా
బంధించానే అన్నివైపులా
బాగుంటుంది నువ్వు నవ్వితే
బాగుంటుంది ఊసులాడితే
బాగుంటుంది గుండెమీద గువ్వలాగ నువ్వు వాలితే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

#Bro

2022 · mini albüm

Benzer Sanatçılar