తానానే నానానే నానానేనా తానానే నానానేనే తానానే నానానే నానానేనా తారారే రారారేరే ♪ నిజమే నే చెబుతున్నా जाने जाना నిన్నే నే ప్రేమిస్తున్నా నిజమే నే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్లకే వదిలెళ్లకే నా గుండెని దోచేసిలా చల్లకే వెదజల్లకే నా చుట్టు రంగుల్నిలా తానారే రారారే రారారేనా తారారే నానారేరే తానారే నానారే తానారేనా తారారే రారారేరే ♪ వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలుసే కన్నుల్తో చూసేది కొంచమే గుండెల్లో లోతే కనిపించెనే పైపైన రూపాలు కాదులే లోలోపలి ప్రేమే చూడాలిలే నిజమే నే చెబుతున్నా जाने जाना నిన్నే నే ప్రేమిస్తున్నా నిజమే నే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా ♪ పెదవులతోటి పిలిచే పిలుపులకన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా అడుగులతోటి దూరం కొలిచేకన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా నీడల్లే వస్తానే నీ జతై నీ తోడల్లే ఉంటానే నీ కథై ఓ ఇనుప పలకంటి గుండెపై కవితల్ని రాసావు దేవతై నిజమే నే చెబుతున్నా जाने जाना నిన్నే నే ప్రేమిస్తున్నా నిజమే నే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా ఆహహా