గోరువంక చిలక జంటకట్టి
గంటకొట్టే నీ గుడిలో హరి ఓం నారాయణ
కోరుకున్న జతల కొంగు ముళ్ళు
కలిసొచ్చే కావళ్లు అడిగే నీ దీవెన
రారా నిత్య కళ్యాణాల నివాసమా
సరగుణ మమ్ము బ్రోవరా
రారా స్వామి ఆనందాల నిధానమా
మొర విని సేద తీర్చరా
గోరువంక చిలక జంటకట్టి
గంటకొట్టే నీ గుడిలో హరి ఓం నారాయణ
♪
తిరుమల కొండలలో వెన్నెలై
కురిసే నీ దయ
కనుముల లోతులలో వేదము
వెలుగూ నీ దయ
నీదు కోవెల ముంగిట నిలిచే
తులసినైనా కాదు కదా
తులసి మాలలు నీకర్పించే
తలపులైనా రావు కదా
తెలివిడి నీది కదా దేవరా
తెలిసే బ్రోవరా
ఈ కలియుగ జీవుడిని కానగా
కరుణే చూపరా
గోరువంక చిలక జంటకట్టి
గంటకొట్టే నీ గుడిలో హరి ఓం నారాయణ
కోరుకున్న జతల కొంగు ముళ్ళు
కలిసొచ్చే కావళ్ళు అడిగే నీ దీవెన
♪
గగనపు తారలకి నింగిలా నిలిచే రూపమా
నెమలికి పించమిది నెత్తిపై నిలిపే దైవమా
ఆ నీదు పాదం సోకగా కరిగే
రాయినైనా కానుకదా
నీదు ఊపిరి గాలికి పలికే
వెదురు నైనా కానుకదా
సకలం నీవు కదా దేవరా
సకుడై తోడు రా
సర్వం నీది కదా
నేనులో నిన్నే చూడరా
గోరువంక చిలక జంటకట్టి
గంటకొట్టే నీ గుడిలో హరి ఓం నారాయణ
రారా నిత్య కళ్యాణాల నివాసమా
సరగుణ మమ్ము బ్రోవరా
రారా స్వామి ఆనందాల నిధానమా
మొర విని సేద తీర్చరా
గోరువంక చిలక జంటకట్టి
గంటకొట్టే నీ గుడిలో హరి ఓం నారాయణ
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri