ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బంధమల్లి ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బంధమల్లి నువ్వే ఇచ్చినా బిడ్డే దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశా తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండే తడిసిపోలేదా జగదీశా ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష నీ కన్ను అది చూడదా ఈ కంటి తడి ఆరదా ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బంధమల్లి గుండే గొంతుగా అమ్మా అనే మాటే తనకు చాలయ్యా మహదేవా తానే నేస్తమై తోడై పెంచిన తల్లికొడుకునోసారి కలిపేవా చనుబాల తీపి తెలిసుంటే ఈశా కనుగొందువే ఈ పేగు బాష చెప్పమ్మా నువు పార్వతి అమ్మంటే ఓ హారతీ ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బంధమల్లి