Kishore Kumar Hits

Ramana Gogula - Dolu Bhaja şarkı sözleri

Sanatçı: Ramana Gogula

albüm: Yogi

(శివాయ నమ ఓం
శివాయ నమ ఓం
శివాయ నమ ఓం)

డోలు బాజా ఆటల్లో నీవే మేటివంట శివశంకరా
ఈల వేసి గగ్గోలు చేసే ఆట నాది దీవించరా
కాళేశ్వరా హర నీ కాలి గంధే భాగ్యమేదో నాకివ్వరా
నీ ముందు నేను చిందేసే యోగం రోజు నాకు అందించరా
అహ ముక్కంటి నువే దిక్కంటి
శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు రా రా గౌరీ ప్రాణేశ్వరా
ఇక నా గుండె కాదా నీ వెండి కొండ ఉండిపోరా లోకేశ్వరా
भोले रे
డోలేరే
డోలేరే

హే, నీ శిరస్సుపైన ఏమున్నది
చందమామ వెలుగున్నది
నీ గొంతుపైన ఏమున్నది
నీలి రంగు నీడున్నది
అరె డం డం డం డమరుకములు చెప్పాయి నీలో వెలుగు నీడ కలిసున్నది
హే, దగ్ దగ్ దగ్ కుదుపు భయము ఉండొద్దు అంటూ నీలో ఉన్నా సత్యాన్ని కంటున్నా
ముక్కంటి నువే దిక్కంటి
శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు రా రా గౌరీ ప్రాణేశ్వరా
ఇక నా గుండె కాదా నీ వెండి కొండ ఉండిపోరా లోకేశ్వరా
(హర హర మహాదేవ శివ శంకర
శివ శంకర
హర హర మహాదేవ శివ శంకర
శివ శంకర
హర హర మహాదేవ శివ శంకర
శివ శంకర
హర హర మహాదేవ శివ శంకర
శివ శంకర)

హే, నీ కంటిలోన నిప్పున్నది భగ్గుమంటే బొగ్గయితది
ఆ అగ్గినాపేదేమున్నది గంగ నీకు తోడున్నది
అరె భం భం భం ప్రమధిగణము అంటుంది నీలో నీరు నిప్పు కూడున్నది
మరి ఘం ఘం మనిషి మనిషి కలిసుండాలంటూ
నీవు చెప్పే వేదాన్ని వింటున్నా
(శంభో
శివశంభో)
శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు రా రా గౌరీ ప్రాణేశ్వరా
ఇక నా గుండె కాదా నీ వెండి కొండ ఉండిపోరా లోకేశ్వరా
డోలు బాజా ఆటల్లో నీవే మేటివంట శివశంకరా
ఈల వేసి గగ్గోలు చేసే ఆట నాది దీవించరా
కాళేశ్వరా అరె నీ కాలి గంధే భాగ్యమేదో నాకివ్వరా
నీ ముందు నేను చిందేసే యోగం రోజు నాకు అందించరా
అహ ముక్కంటి నువే దిక్కంటి
శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు రా రా గౌరీ ప్రాణేశ్వరా
ఇక నా గుండె కాదా నీ వెండి కొండ ఉండిపోరా లోకేశ్వరా
(హర హర మహాదేవ శివ శంకర
హర హర మహాదేవ శివ శంకర)
డోలేరే
హర హర మహాదేవ శివ శంకర
హర హర మహాదేవ శివ శంకర
డోలేరే
(హర హర మహాదేవ శివ శంకర
హర హర మహాదేవ శివ శంకర)
(హర హర మహాదేవ శివ శంకర)
డోలేరే
(హర హర మహాదేవ శివ శంకర)

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar